వాహనదారుడిపై ఫైనాన్షియర్స్ కత్తితో దాడి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ లో ఆటోమొబైల్ ఫైనాన్షియర్స్ రెచ్చిపోయాడు. ఓ వాహనదారుడి పై కత్తి తో దాడికి దిగాడు. వారిని ప్రతిఘటించిన వాహనదారుడు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశాడు. పోలీస్టేషన్ వద్ద ఫైనాన్షియర్స్ కత్తితో నానా హంగామా చేశాడు. పోలీస్టేషన్ లో వున్నానన్న సంగతి సైతం మరిచాడు. వాహన దారుడిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో.. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మెట్లబావిని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
సికింద్రాబాద్‌లోని 17వ శతాబ్దానికి చెందిన బన్సీలాల్‌పేట మెట్ల బావిని దాని అసలు వైభవానికి పునరుద్ధరించారు ఇవాళ (డిసెంబర్ 5) న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. పునర్‌వైభవాన్ని సంతరించుకున్న ఈ అద్భుత కట్టడం సందర్శకులకు నేటి నుంచి అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల సహకారంతో శిథిలావస్థలో ఉన్న పురాతన మెట్ల బావికి గత వైభవాన్ని తీసుకొచ్చింది.
మరోసారి విదేశీ బంగారం పట్టివేత
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. శంషాబాద్‌లో ఏదో ఒక అక్రమరవాణా వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తోంది. అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా అక్రమ రవాణా మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దీంతో కేటుగాళ్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీంతో బంగారం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతునే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో సారి విదేశీ బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు.
నకిలీ బాబాకేసు..అమ్మాయిల ఫిజిక్ ని బట్టి రేటు
నకిలీ బాబాకేసు భాగ్యనగరంలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఈఘటన రాష్ట్రంలోనే హాట్ టాపిక్. ఎన్జీవో ఆపరేషన్ ఎంట్రీతో పాతబస్తీ చర్చనీయాంశంగా మారింది. నకిలీ బాబా మహిళలపై చేస్తున్న అరాచకాలకు తెరదించింది. అయితే పాతబస్తీ బాబా కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. పూజల పేరుతో యువతుల నగ్న ఫోటోల బాబా వీడియోలు తీశాడు. నగ్న ఫోటోలు వీడియోలను వ్యభిచారి ముఠాలకి పంపింస్తున్నాడనే వార్త పోలీసులకు షాక్ కు గురయ్యేలా చేసింది. పాతబస్తీ చెందిన మహిళా నగ్న వీడియో, ఫోటోలని వ్యభిచారం గృహాలకు బాబా పంపిచాడు. మహారాష్ట్రలోని వ్యభిచార ముఠాలకి అమ్మాయిల ఫోటోలు బాబా విక్రయించాడని అధికారులు గుర్తించారు. ఫోటోలను చూసి అమ్మాయిలకు, మహిళలకు ముఠా రేటును ఫిక్స్ చేస్తున్నారని తెలిపారు. పాతబస్తీ చెందిన ఎన్జీవో చేసిన ఆపరేషన్ లో బాబా లీలలు గుట్టురయ్యాయని అధికారులు తెలిపారు. ఫేక్ బాబా హుసేని చంద్రాయన గుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బాబా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆఫోన్‌లో వందల సంఖ్యలో మహిళల నగ్న ఫోటోలు వీడియోలు లభ్యమయ్యాయిని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎంతమంది మహిళలని ట్రాప్ చేశారా? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
నేడే రాయలసీమ గర్జన.. కర్నూలులో భారీ ర్యాలీ
ఏపీలో మూడు రాజధానుల రాజకీయం నడుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తీరుతామని ప్రభుత్వం తెగేసి చెప్తోంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈరోజు కర్నూలులో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన సభ జరగనుంది. వైసీపీ మద్దతుతో ఈ సభను నాన్ పొలిటికల్ జేఏసీ భారీ ఎత్తున నిర్వహించనుంది. కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ బహిరంగ సభకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజాప్రతినిధులు, 30 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మంత్రులు ఈ సభకు హాజరుకానున్నారు.
హైకోర్టు పెట్టకుండా.. కర్నూలులో గర్జనకు ఎలా మద్దతిస్తారు?
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఏపీలో జగన్ పాలనలో అన్నీ రివర్స్‌లో జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎక్కడైనా చిన్న పార్టీలు, ప్రతిపక్షాలు ఉద్యమించడం చూశామని.. కానీ ఏపీలో వైసీపీనే ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం దేనికి సంకేతమని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నిస్తున్నారు. కర్నూలు వేదికగా రాయలసీమ గర్జనను వైసీపీనే ముందుండి నడిపిస్తుందని.. ఇది ప్రజలను దారుణంగా మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. ఏపీలో హైకోర్టులో అమరావతిలో పెడతామని సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు న్యాయరాజధానిగా కర్నూలును చేయాలంటూ నిర్వహిస్తున్న రాయలసీమ గర్జనకు ఎలా మద్దతు ఇస్తుందని రామకృష్ణ నిలదీశారు.
పుంగనూరులో పారిశ్రామికవేత్త ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి పారిశ్రామిక వేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి కిటికీ అద్దాలు, కుర్చీలు పగిలిపోగా, కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. సదుంలో రైతు భేరి నిర్వహిస్తామని చెప్పడంతోనే వైసీపీ శ్రేణులు పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు.
మూడేళ్ల తర్వాత ‘సాహో’కు హిట్ టాక్
ఒక సినిమా రిలీజ్ అయ్యాకా థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యి, కొన్నేళ్ల తర్వాత ‘కల్ట్ స్టేటస్’ అందుకోవడం ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. ‘ఆరెంజ్’ సినిమా నుంచి ‘గౌతమ్ నందా’, ‘1 నేనొక్కడినే’ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కల్ట్ స్టేటస్ అందుకున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ప్రస్తుతం ఈ పరిస్థితిలోనే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహోపై ఇండియా వైడ్ భారి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ‘సాహో’ చిత్ర యూనిట్ అగ్రెసివ్ గా ప్రమోట్ చేసింది. ఇక ప్రభాస్ మరో పాన్ ఇండియా హిట్ అందుకోవడమే లేట్ అని అంతా అనుకున్నారు కానీ ‘సాహూ’ రిలీజ్ అయ్యాకా అంతా తలకిందులు అయ్యింది. ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
Revanth Reddy: కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే ఆరెండు పార్టీలు కుట్ర