కార్తీక్ ఆర్యన్, శ్రద్ధా కపూర్… వినటానికే చాలా రిఫ్రెషింగ్ గా ఉంది కదా… జోడీ! ఈ కాంబినేషన్ సెట్ చేసే పనిలో ఉన్నాడట సాజిద్ నడియాడ్ వాలా. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కార్తీక్ తో ‘సత్యనారయణ్ కీ కథ’ సినిమా రూపొందించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. అయితే, రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో కార్తీక్ తో కలసి నటించే బ్యూటీ ఎవరో క్లారిటీ లేదు. కాకపోతే, ముంబైలో శ్రద్ధా పేరు మాత్రం జోరుగా వినిపిస్తోంది…
టైగర్ ష్రాఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధవన్ లాంటి యంగ్ హీరోస్ తో ఇంత వరకూ శ్రద్ధా పని చేసింది. వారితో ఆమె చేసిన సినిమాలు దాదాపుగా అన్నీ హిట్టే. అయితే, కార్తీక్ తో ఇంతకు ముందు ఒకట్రెండు సార్లు అనుకున్నా వర్కవుట్ కాలేదు. దినేశ్ విజన్ అనే నిర్మాత తన సినిమాలో ఈ యంగ్ కపుల్ ని ఆన్ స్క్రీన్ చూపాలనుకున్నాడు. అలాగే, ‘కిరిక్ పార్టీ’ రీమేక్ లోనూ వీరిద్దర్నీ అనుకున్నారు. అవేవీ మెటీరియలైజ్ కాలేదు. అయితే, ఇప్పుడు కార్తీక్ అండ్ శ్రద్ధా లవ్లీ కాంబినేషన్ ఆల్మోస్ట్ డన్ అంటున్నారు…
సాజిద్ నడియాడ్ వాలా బ్యానర్ లో ఇప్పటికే మిస్ కపూర్ కొన్ని సినిమాలు చేసింది. కరణ్ జోహర్, షారుఖ్ ఖాన్ బ్యానర్స్ లో సినిమాలు వదులుకున్నాక తొలిసారి కార్తీక్ కూడా సాజిద్ సినిమాలో నటించబోతున్నాడు. అందుకే, తమ బ్యానర్ లో ఫేవరెట్ హీరోయిన్ అయిన శ్రద్ధాతో కార్తీక్ ని జోడీ కట్టించాలని నిర్మాత సాజిద్ భావిస్తున్నాడట. ‘సాహో’ సుందరి సరేనని చెప్పిందంటున్నారు. చూడాలి మరి, అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడో…