ఐదేళ్ళ క్రితం కృష్ణగాడి వీరప్రేమగాథ
చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2
వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. అయితే ఆ పైన మాత్రం అమ్ముడు నటించిన చిత్రాలన్నీ పరాజయం పాలైనాయి. ఈ ఐదేళ్ళలోనే తమిళ, హిందీ, పంజాబీ భాషా చిత్రాలలోనూ మెహ్రీన్ తన అదృష్టం పరీక్షించుకుంది. ఇక తెలుగులో ప్రస్తుతం ఎఫ్ 3
లో నటిస్తోంది. ఈ యేడాది మార్చిలో మెహ్రీన్ వివాహ నిశ్చితార్థం భవ్య భిష్ణోయ్ తో జరిగింది. ఇదే ఏడాది వీరు పెళ్ళి పీటలు కూడా ఎక్కుతారని అంటున్నారు. ఈ సమయంలో సినిమాలు కాస్తంత తగ్గించుకున్నట్టుగా కనిపిస్తున్నా… మెహ్రీన్ ఠక్కున మరో రెండు అవకాశాలను చేజిక్కించుకుంది. అందులో ఒకటి మారుతీ దర్శకత్వ పర్యవేక్షణలో వెబ్ సీరిస్ కాగా, మరొకటి మారుతీ దర్శకత్వం వహించ బోతున్న ఓటీటీ మూవీ. ఈ సినిమా కోసం మెహ్రీన్ ఏకంగా యాభై లక్షలు డిమాండ్ చేసిందట. అయితే…. ఆమెకు నచ్చజెప్పి 40-45 లక్షల మధ్యలో సెట్ చేశారట. ఈ అమ్మడి కథ ఇలా ఉంటే… మరో టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా సైతం తన రెమ్యూనరేషన్ ను పెంచేసిందట. నిజానికి రకుల్ ప్రీత్ కు ఈ మధ్యకాలంలో సరైన హిట్ అనేది పడలేదు. అయితే ప్రతి రోజు పండగే
చిత్రానికి రూ.75 లక్షల పారితోషికం తీసుకున్న రాశీఖన్నా.. ఇప్పుడు దాదాపు కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట. ఈ తేనెకళ్ళ చిన్నది గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్
తో పాటు నాగచైతన్య థ్యాంక్యూ
మూవీలో నటిస్తోంది. సక్సెస్ ఉన్నప్పుడు ఓకే కానీ ఫ్లాపుల్లో సైతం ఈ అందాల భామలు ఇంతగా పారితోషికాన్ని పెంచేశారేమిటీ అని అందరూ ఆశ్చపోతున్నారు.