బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ “రాక్షసుడు”. 2019లో విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై నేటితో రెండేళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా “రాక్షసుడు-2” సినిమా నుంచి కొత్త అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. రీసెంట్ గా నిర్మాత కోనేరు సత్యనారాయణ డైరెక్టర్ రమేష్ వర్మతోనే “రాక్షసుడు”కు సీక్వెల్ గా “రాక్షసుడు 2″ని రూపొందించబోతున్నట్లు ప్రకటించాడు. మొదటి చిత్రం కంటే సీక్వెల్ లో భారిగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఉత్కంఠభరితంగా రూపొందనున్న ఈ చిత్రంలో ఓ స్టార్ హీరోను తీసుకుంటామని, దానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని ఇప్పటికే వెల్లడించారు.
Read Also : పుష్ప : దేవిశ్రీ బర్త్ డే స్పెషల్ గా అదిరే అప్డేట్…!
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంటరెస్టింగ్ అప్డేట్ ను ఇస్తూ మేకర్స్ ట్వీట్ చేశారు. “మేము దీనిని 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబోతున్నాము. పూర్తిగా లండన్‌లో చిత్రీకరిస్తాము. ఇది అనేక యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది. మేము దీనిని హాలీవుడ్ చిత్రంలాగా సుదీర్ఘ స్థాయిలో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాము” అని కోనేరు సత్యనారాయణ తెలిపారు. చూస్తుంటే ఈ ఫ్రాంచైజ్ లోనే వరుస సిరీస్ లను నిర్మించబోతున్నారని అన్పిస్తోంది.