దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ రూపొందుతోన్న విషయం మనకు తెలిసిందే. అయితే, ఆ సినిమాలో కంగనా టైటిల్ రోల్ చేస్తుండగా అరవింద్ స్వామి ఎంజీఆర్ గా కనిపించనున్నాడు. జూన్ 18న ఆయన బర్త్ డే సందర్భంగా ‘తలైవి’ నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి ఓ ఇంట్రస్టింగ్ ఫోటో షేర్ చేశాడు ట్విట్టర్ లో. ‘హ్యాపీ బర్త్ డే అరవింద్ స్వామీ’ అంటూ ఆయన నెటిజన్స్ ముందుంచిన పిక్ లో ఎంజీఆర్ గెటప్ లో దర్శనమిచ్చాడు స్వామి! తెల్ల అడ్డ పంచె కట్టుకుని వైట్ షర్ట్ తో రాయల్ గా ఉన్న అందగాడ్ని చూసి ఫ్యాన్స్ మెస్మరైజ్ అయ్యారు…
Read More: చికిత్స కోసం అమెరికాకి రజనీకాంత్… వైరముత్తు ట్విట్టర్ సందేశం!
అరవింద్ స్వామి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన మరో సినిమా ‘నరగసూరన్’ దర్శకుడు కార్తీక్ నరేన్ కూడా సొషల్ మీడియా బాట పట్టాడు. సినిమా సెట్స్ మీద స్వామితో తాను కలసి ఉన్న ఫోటోను షేర్ చేసి బర్త్ డే విషెస్ తెలిపాడు. ‘పాజిటివ్ టైమ్స్ అహెడ్’ అని కూడా కార్తీక్ నరేన్ అనటం విశేషం. ఇప్పటికే ఆలస్యమైన ‘నరగసూరన్’ త్వరలో సోనీలివ్ యాప్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి, అరవింద్ స్వామి, శ్రియ శరణ్, సందీప్ కిషన్, ఆత్మిక స్టారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వస్తుందో లేక థియేటర్స్ కోసం ఎదురు చూస్తారో…