లిప్ లాక్స్ నేహాను స్టార్ ని చేస్తాయా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేహాశెట్టి… ‘మోహబూబా, గల్లీరౌడీ’ చిత్రాల్లో మెరిసిన కన్నడ కస్తూరి. తెలుగునాట కన్నడ భామల హోరు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో నేహా కూడా టాలీవుడ్ పై కన్నేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న రష్మిక మందన్న, పూజా హెగ్డే కన్నడ భామలే కావటంతో వారి బాటలో తను కూడా స్టార్ కావాలని తాపత్రయపడుతోంది నేహా శెట్టి. తాజాగా కృతి శెట్టి కూడా హ్యాట్రిక్ హిట్స్ తో తెలుగునాట పాగా వేసిన నేపథ్యంలో నేహా నటించిన ‘డిజె టిల్లు’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమాతో ఎలాగైనా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది నేహా శెట్టి. అందుకు లిప్ లాక్స్ కి సైతం వెనుకాడటంలేదు.

నిజానికి ఈ గ్లామరస్ హాటీ ‘మెహబూబా’ తోనే తనదైన ముద్రవేయటానికి ప్రయత్నించింది. ఆ సినిమా డిజాస్టర్ కావటంతో అమ్మడి యత్నం నెరవేరలేదు. ఆ సినిమాలో సైతం ముద్దులకు హద్దు పెట్టుకోకుండా ఎక్స్ పోజింగ్ కి సై అంది. ఆ తరువాత కొంత మంది యువ హీరోలతో జోడీ కట్టే అవకాశం వచ్చినా ఎందుకో నిరాకరించింది. ఆ తర్వాత సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’లో మెరిసింది. అయినా తన టార్గెట్ ను రీచ్ కాలేక పోయింది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ తో కలసి ‘డీజే టిల్లు’తో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో సైతం ఒంపుసొంపులను ప్రదర్శించటమే కాదు లిప్ లాక్స్ తో రెచ్చిపోయి గ్లామర్ గేట్స్ ను ఎత్తేసింది. ఎలాగైనా ఈ సినిమాతో టాలీవుడ్ లో పాగా వేయాలనే కృతనిశ్చయంతో ఉంది నేహాశెట్టి. ఈ వారం ఆడియన్స్ ముందుకు వస్తున్న నేహా తన మూడో ప్రయత్నంలోనైనా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుందో? లేదో? చూద్దాం.
Also Read


తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!