ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 8వ తెలుగు సంబరాలు ఈవెంట్ కు సిద్ధమవుతోంది. జూలై 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అమెరికాలోని టంపాలో జరగనున్నాయి. తాజాగా హైదరాబాద్ లో నాట్స్ 8వ తెలుగు సంబరాలు కార్యక్రమ కర్టెన్ రైజర్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సంబరాలు కాన్ఫరెన్స్ కన్వీనర్ అండ్ పూర్వపు చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనిలు అమెరికా నుండి విచ్చేసి మీడియా సమావేశం నిర్వహించారు. నటి జయసుధ, ఆమని, దర్శకులు హరీశ్ శంకర్, మెహర్ రమేష్, సంగీత దర్శకుడు తమన్, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, కళ్యాణ్ చక్రవర్తి, తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని మాట్లాడుతూ మా సంస్థ 8వ తెలుగు సంబరాలు కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉంది.
Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు చుక్కలే.. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు
ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు కవులు, కళాకారులు, నటీనటులు, ఇతర రంగాల ప్రముఖు హాజరుకాబోతున్నారు. మా సభ్యులు కమిటీలుగా 300మంది ఈ ఈవెంట్ కోసం పనిచేస్తున్నారు. 10 వేల మంది తెలుగు సంబరాలు కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నాం. రాబోయో 15 ఏళ్ల వరకు మా నాట్స్ సంస్థ ఎలాంటి అభివృద్ధి దిశలో మరింత సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలో ప్లాన్ చేస్తున్నాం. అన్నారు. నటి జయసుధ మాట్లాడుతూ – నాట్స్ అంటే సంబరాలు మాత్రమే కాదు సర్వీస్ ఓరియెంటెడ్ ఆర్గనైజేషన్. నాట్స్ గత తెలుగు సంబరాలకు కూడా నన్ను ఆహ్వానించారు. అయితే మా మదర్ చనిపోవడం వల్ల వెళ్లలేకపోయాను. ఈ సారి తప్పకుండా వెళ్తాను. ఇటీవల నేను ఇంగ్లీష్ మూవీలో నటించాను. ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు నాట్స్ తెలుగు సంబరాలు జరిగే ప్లేస్ కు దగ్గరలోనే జరిగింది. నాట్స్ ఈవెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.