పలు సినిమాలలో విభిన్న పాత్రలను పోషించిన నాజర్ ప్రస్తుతం ఓ సినిమాలో సైంటిస్ట్ గా కనిపించనున్నాడు. ఆ సినిమా ‘నల్లమల’. ఇందులో నాజర్ లుక్ ను సోమవారం విడుదల చేశారు. అటవీ నేపథ్యం వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు దర్శకుడు రవి చరణ్ చెబుతున్నారు. అమిత్ తివారీ, భానుశ్రీ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్ర ధారులు. అసాధారణ మేథస్సు గల ఓ సైంటిస్ట్ ప్రపంచాన్ని శాసించే శక్తి తన పరిశోధనలకు ఉండాలని తన ప్రయోగాలకు నల్లమలను క్షేత్రంగా ఎంచుకుంటాడు. అక్కడ అతనేం ప్రయోగాలు చేశాడు. ఏం కనుగొన్నాడు. ఆ ప్రయోగాల ఫలితంగా ఏం జరిగిందనేది ‘నల్లమల’ కథాంశం అంటున్నాడు దర్శకుడు. ఈ చిత్రానికి నిర్మాత ఆర్.ఎమ్.