NTV Telugu Site icon

KGF Chapter 2: రికార్డ్స్ అనేవి బాధ్యత

Kgfff

Kgfff

యష్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వారాహి చలన చిత్రం, హాంబలే ఫిలిమ్స్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ కే జీ ఎఫ్ చాప్టర్ 2….సంజయ్ దత్ రవీనా టాండన్ కీలక పాత్ర లో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. నిర్మాత కొర్రపాటి సాయి, హీరో యాష్, నిధి శెట్టి, ప్రశాంత్ నీల్, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ..డైరెక్టర్ ప్రశాంత్ నిల్ నామీద నమ్మకంతో 4పాటలు రాసే అవకాశం ఇచ్చారు.

హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ: kgf ఒకటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ఆడియన్స్ ఎంతో సపోర్ట్ చేశారు .సినిమా టీమ్ అంతా ఎంతో కష్ట పడి వర్క్ చేసారు..అందరూ తప్పకుండా సినిమా చూడండి. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ: kgf గురించి మాట్లాడాలి అంటే ఇండియా సినిమా గురించి మాట్లాడాలి
బాలీవుడ్ లో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అంకెలు వున్నాయి. తరువాత మన తెలుగు ఇండస్ట్రీ లో చిరంజీవి గారి సినిమా ఇంత కలెక్ట్ చేసింది అనే ఫిగర్స్ చూశాం. తమిళ్ మలయాళ లాంగ్వేజ్ లో ఆ హిరో సినిమా ఇంత కలెక్ట్ చేసింది ఆ హిరో సినిమా అంత వసూల్ చేసింది అని చెప్పుకున్నాం.

కన్నడ ఇండస్ట్రీ లో సినిమా అంటే అయిదు కోట్ల బడ్జెట్ అంటే ఎక్కువ. ఉగ్రం సినిమా అప్పుడు నాకు ప్రశాంత్ నిల్ పరిచయం. ప్రశాంత్ నిల్ ఎక్కువ బడ్జెట్ తో సినిమా తీస్తున్నాడు అన్నప్పుడు ఒక ఆశ్చర్యం వేసింది. కేజీఎఫ్‌ సినిమా తో ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం చూసేటట్టు చేశాడు. Kgf తో ఈ రోజు కన్నడ ఇండస్ట్రీ కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గర్వించే సినిమా తీశారు.

మా రాజమౌళి లాగా సినిమా సినిమా కి స్థాయిని పెంచుతున్నాడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ..మేము ఎక్కడి కి వెళ్ళినా ఒక తెలుగు సినిమా తీశారు అన్నంత రెస్పాన్స్ చూపించారు. కైకాల సత్యనారాయణ అనే లెజెండ్ పేరు పెట్టుకొని చేస్తున్నాము అంటే అంతే బాధ్యతగా చేశాం. ఇండియన్ ఇండస్ట్రీ లో పాన్ ఇండియా సినిమా అంటే రాజమౌళి పేరు చెప్పాలి. చిన్న దారిగా వున్న దానిని పెద్ద హైవేగా మార్చారు రాజమౌళి. నా టీమ్ లేకపోతే నేను లేను. సంజయ్ దత్ రవీనా ప్రకాష్ రాజ్, శ్రీనిధి అందరూ ఎంతో సపోర్ట్ చేశారు మాకు. హిరో యాష్ మాట్లాడుతూ: కేజీఎఫ్‌ బిగ్ జర్నీ.నాకు ఎంతో ఇంపార్టెంట్ జర్నీ.

Kgf మీకు కనెక్ట్ అయి మి గుండెల్లో స్థానం ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. మన ఇండస్ట్రీ లో ఎక్కువ మంది హార్డ్ వర్క్ చేస్తారు వండర్ఫుల్ టెక్నిషియన్స్ వున్నారు. సోల్ ఫుల్ సినిమా తీశాడు ప్రశాంత్ నీల్. తెలుగు ఆడియన్స్ ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా హార్డ్ వర్క్ చేసాము. ఈ స్టోరీ మదర్ అండ్ సన్ ఎమోషన్. ఈ సినిమా కు తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. మా మీద పెట్టుకున్న నమ్మకం తప్పకుండా నిలబెట్టుకుంటాం. రికార్డ్స్ అనేవాటిని కొత్త సినిమా వచ్చి బద్దలు కొట్టాలి. రికార్డ్స్ అనేవి ఒక బాధ్యత ఎంత మంది చూశారు ఎంత మంది ఎంజాయ్ చేశారు అని చూస్తాం. మంచి హీరో పక్కన కాదు కానీ మంచి దర్శకుడు నుంచి ఆఫర్ వచ్చి ఇద్దరి హీరోలను హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళతో చేస్తానన్నారు యష్.