కార్తీక్ ఆర్యన్… ఈ పేరు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. కారణం… ఆయన చుట్టూ ముసురుకుంటోన్న కాంట్రవర్సీలే! కరణ్ జోహర్, షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థల చిత్రాల నుంచీ కార్తీక్ ని తొలగించారు. దాంతో బీ-టౌన్ లో కార్తీక్ ని టార్గెట్ చేస్తున్నారని దుమారం రేగింది. అయితే, కాంట్రవర్సీల మాట ఎలా ఉన్నా నెపోటిజమ్ కు, స్టార్ కిడ్స్ కు ఫేమస్ అయిన మన బాలీవుడ్ లో ఈ యంగ్ హీరో స్వంతంగా ఎదిగాడు. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే క్రేజీ స్టార్ గా మారాడు. మరి కార్తీక్ ఆర్యన్ గురించి మనకు తెలియని ఆసక్తికర అంశాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందామా?
కార్తీక్ ఆర్యన్ అసలు పేరు కార్తీక్ తివారీ. ఫుట్ బాల్, టెన్నిస్ ఆయన ఫేవరెట్ స్పోర్ట్స్. మందు, సిగరెట్ అంటే అసలు పడదు. అంతే కాదు మిష్టర్ తివారీ, ప్యూర్ వెజిటేరియన్ కూడా! కోడిగ్రుడ్లకు మాత్రం కార్తీక్ మెనూలో మినహాయింపు ఉంది. ఆయన ఎగ్స్ తింటాడట.
కార్తీక్ శాఖాహారం తినటమే కాదు… వండుతాడట కూడా! ఆయన మంచి కుక్! దాంతో పాటూ మాంచి ‘స్వీట్ లవ్వర్’ కూడా! అదేనండీ, ‘స్వీట్ లవ్వర్’ అంటే రొమాంటిక్ యాంగిల్ ఏం లేదు…. మిఠాయిలు చక్కగా లాగిస్తాడని అర్థం!
కార్తీక్ గురించిన మరో క్యూట్ అండ్ లవ్లీ ఫ్యాక్ట్ ఏంటంటే… ఆయనకి డింపుల్స్ ఉన్న అమ్మాయిలంటే ఇష్టమట! అయితే, తెర మీద లవ్వర్ బాయ్ గా అదరగొట్టే మన హ్యాండ్సమ్… నిజ జీవితంలో తన మనసు దోచిన సొట్ట బుగ్గల సుందరి ఎవరో ఇంకా చెప్పలేదు!
పెద్దయ్యాక సైంటిస్ట్ అవుదామనుకున్న ఈ బాలీవుడ్ స్టార్ చిన్నప్పుడు దిల్లీలోని కరోల్ బాగ్ ఏరియాలో తప్పిపోయాడు! నాలుగు గంటల పాటూ ఆచూకీ దొరకలేదట! అప్పుడు బుడ్డోడి వయస్సు నాలుగేళ్లు మాత్రమే!
‘బిగ్ బ్యాడ్ బాలీవుడ్’ అనిపించుకునే ముంబై గ్లామర్ ప్రపంచంలోకి స్వయంకృషితో వచ్చిన కార్తీక్ ఆర్యన్ చాలా పంక్చువల్. చెప్పిన టైంకి షూటింగ్ స్పాట్ లో సరిగ్గా హాజరవుతాడు. ఆయన సక్సెస్ సీక్రెట్స్ లో ఈ క్రమశిక్షణ కూడా ఒకటి అంటుంటారు దగ్గరి వాళ్లు…