కాంట్రవర్సీ ‘క్వీన్’ కంగనాకి కోర్టు కష్టాలు తప్పటం లేదు. ప్రతీ రోజూ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేసే ముక్కుసూటి ముద్దుగుమ్మ ఇప్పుడు కాపీరైట్ కొట్లాటలో ఇరుక్కుంది. తాను ‘మణికర్ణిక రిటర్న్స్ : ద లెజెండ్ ఆఫ్ దిడ్డా’ పేరుతో సినిమా చేయబోతున్నట్టు కొన్నాళ్ల కింద కంగనా ట్వీట్ చేసింది. అయితే, తన పర్మిషన్ లేకుండా తన పుస్తకంలోని కథని వాడుకుంటున్నారని ఆశిష్ కౌల్ అనే రచయిత కోర్టుకు వెళ్లాడు. ఆయన కంగనాకి ఒక మెయిల్ చేయగా… అందులోని…