బాలీవుడ్ లో చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఓటీటీ బాట పడుతున్నారు. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న యాక్టర్స్ మాత్రమే కాదు కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయిన వారు కూడా డిజిటల్ జోష్ ప్రదర్శిస్తున్నారు! తమ ఫ్యామిలీలో ఇప్పటికే సీనియర్ బచ్చన్, జూనియర్ బచ్చన్ ఓటీటీ బాట పట్టగా జయా బచ్చన్ కూడా వెబ్ సిరీస్ కి సై అంటోంది! 5 ఏళ్ల తరువాత మళ్లీ తెర మీదకు రాబోతోంది…
జయా బచ్చన్ ‘సదా బహార్’ అనే సిరీస్ కి ఓకే చెప్పింది. అయితే, ఇది ఇప్పటి విషయం కాదు. కొన్నాళ్ల క్రితమే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఫిబ్రవరిలో షూటింగ్ కూడా మొదలైంది. కానీ, తరువాత లాక్ డౌన్ సమయంలో వెబ్ సిరీస్ మేకర్స్ అర్థాంతరంగా ఆపేశారు. అయితే, ఇప్పుడు జయా బచ్చన్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశారు. ఆమె ముంబైలోని పలు రియల్ లొకేషన్స్ లో జరుగుతోన్న షూటింగ్ లో పాల్గొంటున్నారు…
జయా బచ్చన్ డెబ్యూ వెబ్ సిరీస్, అలాగే, ఆమె కమ్ బ్యాక్ ప్రాజెక్ట్ గా భావిస్తోన్న ‘సదా బహార్’ ఏ ఓటీటీ వేదికలో అందుబాటులో ఉంటుందో ఇంకా తెలియదు. ఆమె 5 ఏళ్ల కింద అర్జున్ కపూర్, కరీనా స్టారర్ ‘కీ అండ్ కా’లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు…