‘వాల్ట్ డిస్నీ పిక్చర్స్’ ఫ్యాంటసీ లవ్వర్స్ కోసం రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ ‘జంగల్ క్రుయిజ్’. డిస్నీ ల్యాండ్ లోని థీమ్ పార్క్ ‘జంగల్ క్రుయిజ్’ ఆధారంగా ఈ సినిమాని రూపొందించటం విశేషం! 1955లో మొదటి సారి జంగల్ క్రుయిజ్ రైడ్ మొదలైంది. అప్పట్నుంచీ డిస్నీ ల్యాండ్ కి వచ్చిన వారికి అదొక స్పెషల్ అట్రాక్షన్. మరీ ముఖ్యంగా, 50లు, 60లలో అమెరికాలో జంగల్ క్రుయిజ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే, వాల్డ్ డిస్నీ ఇప్పుడు ‘జంగల్ క్రుయిజ్’ పేరుతో ఓ ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమా ప్లాన్ చేసింది. డ్వైన్ జాన్సన్, ఎమిలీ బ్లంట్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే, ఒకేసారి థియేటర్స్ తో పాటూ డిస్నీ ప్లస్ ఓటీటీలోనూ రిలీజ్ అవుతోన్న ‘జంగల్ క్రుయిజ్’ సినిమాకి ప్రస్తుతం ప్రమోషన్ యాక్టివిటి నడుస్తోంది. అందుకే, తమ క్యాంపైన్ లో భాగంగా బిహైండ్ ద సీన్స్ వీడియో ఒకటి విడుదల చేశారు…
డిస్నీ ల్యాండ్ లోని జంగల్ క్రుయిజ్ థీమ్ పార్క్ చరిత్ర వివరించిన డ్వైన్ జాన్సన్ ఓ ఆసక్తికర విషయం కూడా చెప్పాడు. జంగల్ క్రుయిజ్ 1955లో మొదలైనప్పుడు తొలిగా ప్రయాణించిన ఇద్దరు వీఐపీలు ఎవరో తెలుసా? థీమ్ పార్క్ డిజైన్ చేసిన వాల్ట్ డిస్నీ, మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు! వారిద్దరూ అప్పట్లో తొలిసారి జంగల్ క్రుయిజ్ రైడ్ ని ఎంజాయ్ చేశారు. ‘జంగల్ క్రుయిజ్’ మూవీ మేకింగ్ వీడియోలో మనం నెహ్రుని కూడా చూడవచ్చు!
ఇప్పటికే వరల్డ్ వైడ్ ప్రిమియర్ ముగించుకున్న ‘జంగల్ క్రుయిజ్’ సినిమా పాజిటివ్ రివ్యూలు పొందింది. ఆడియన్స్ ఆసక్తిగా ఆన్ లైన్ అండ్ థియేట్రికల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతి త్వరలో డ్వైన్ జాన్సన్, ఎమిలీ బ్లంట్ స్టారర్ ప్రపంచం ముందుకు రానుంది…