రెండు పాటలు మినహా ఆచార్య షూటింగ్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయ్యింది. రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ వివరాలను దర్శకుడు కొరటాల శివ తెలియచేస్తూ, ” ‘ఆచార్య’ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను జూలై 31 నాటికి అనుకున్న ప్లాన్ ప్రకారం పూర్తి చేశాం. రెండు పాటలను మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఆగస్ట్ 20 నుంచి చిరంజీవి, చరణ్ మీద ఓ సాంగ్‌ను, అలాగే చరణ్, పూజా హెగ్డే మీద మరో సాంగ్‌ను చిత్రీకరిస్తాం. దీంతో సినిమా మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిరంజీవిగారి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు” అని అన్నారు.
Also Read
నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, ”మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను కమర్షియల్ యాంగిల్లో ప్రేక్షకాభిమానులు మెచ్చేలా తెరకెక్కించడంలో దిట్ట అయిన డైరెక్టర్ కొరటాల శివ తనదైన శైలిలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను రూపొందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుండి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఏమేమి కోరుకుంటారో అన్నీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఇప్పటికే విడుదలైన లాహే లాహే.. సాంగ్, టీజర్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ అంచాలను మించేలా సినిమా ఉంటుంది” అని చెప్పారు. అయితే… ‘ఆచార్య’ విడుదల తేదీని మాత్రం దర్శక నిర్మాతలు ఇంకా ఖరారు చేయలేదు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!