Yupp tv CEO : సమ్మక్క-సారక్క జాతర మా తాత ఏర్పాటు చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల పై గత రెండు రోజులుగా రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణపై స్థల యజమానుల్లో ఒకరైన Yupp tv CEO ఉదయానందన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నలభై సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న జాతర స్థలం పూర్తిగా మా కుటుంబ సభ్యులదేనని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ స్థలంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జోక్యంతో రిన్నోవేషన్ కమిటీ ఏర్పాటు చేసి పనులు చేపట్టారని, ప్రైవేటు స్థలంలో ఇతరులు పని చేయడాన్ని సవాలు చేస్తూ మేము హైకోర్టును ఆశ్రయించామన్నారు. హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పాటు జాతర కూడా మేమే నిర్వహించాలని చెప్పిందని ఆయన పేర్కొన్నారు. 1975 లో మా తాత సుధాకర్ రెడ్డి ఈ జాతరను ఏర్పాటు చేశారని, ఆ తర్వాత మా పెద్దనాన్న రామకృష్ణారెడ్డి ఇప్పటివరకు జాతర నిర్వహిస్తూ వస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ సారి కూడా మా పెదనాన్న ఆధ్వర్యంలోనే విధిగా వీణవంక సమ్మక్క జాతర నిర్వహిస్తామన్నారు. జాతర జరిగే స్థలం పూర్తిగా పాడి కుటుంబ సభ్యులకు సంభందించిన ప్రైవేట్ పట్టా లాండ్ అని హై కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. జాతరను ఎండోమెంట్ వారు కేవలం పర్యవేక్షించవచ్చు తప్ప ఎలాంటి జోక్యం చేసుకోరాదని కోర్టు చెప్పిందని, మా తాతగారైన పాడి సుధాకర్ రెడ్డి కుటుంబంతో పాడి కౌశిక్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ అగ్ర నాయకత్వానికి, ఉన్నత అధికారులకు పాడి సుధాకర్ రెడ్డి మా తాత అని పాడి కౌశిక్ చెప్పుకుంటున్నారని, నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఈ విషయం గుర్తించాలన్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కల్పించాలని, ఈ విషయంలో ఇవాళ ఉదయం కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ను, కలెక్టర్‌ను కలిసి విన్నవించామన్నారు.
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!