కేసీఆర్ ఇతర రాష్ట్రంలో రైతులకు పరిహారం ఇవ్వడంపై అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్లు ఉందని వైఎస్ షర్మిల ఎద్దేవచేశారు. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను ఇవాల్టి (శనివారం) నుంచి పునఃప్రారంభించనున్న సంగతి తెలిసిందే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తాళ్లమడ గ్రామం వద్ద పాదయాత్ర 1000 కి.మీ పైలాన్ నుంచే పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతూ..
టిఆర్ ఎస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఖజానా ఖాళీ కావడం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఉన్న వారికే రాజ్యసభ పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. 860 కోట్ల రూపాయలు TRS పార్టీ అకౌంట్ లో ఉంటే.. ఆ పార్టీ నేతల అకౌంట్లో ఇంకా ఎన్ని ఉంటాయని ప్రశ్నించారు. పెట్టుబడులు వస్తే నిరుద్యోగ సమస్య ఎందుకు తీరడం లేదని మండిపడ్డారు. విదేశాలకు షికారు కోసం వెళ్లారని ఎద్దేవ చేశారు. ఆంధ్ర సంస్థలను మూసి వేస్తామని కేసీఆర్ అన్నారనే కాంటెస్ట్ లో వైఎస్సార్ వీసా అనే పదం వాడారని గుర్తు చేశారు.
నడిచింది నేనే అయినా.. నడిపించింది ప్రజలే అని కొనియాడారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ ని ప్రజలు మరిచిపోలేదని హర్షం వ్యక్తం చేశారు. షర్మిలను ఆదరిస్తున్నారంటే.. అది వైఎస్సారే కారణమని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉందా ? లేదా ? అని ప్రజలకు అనుమానం వస్తుందనే.. ప్రజల కోసమే పాదయాత్ర చేస్తున్నానని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల అన్నారు.
Hyderabad: బావర్చి హోటల్ లో అగ్ని ప్రమాదం