ఖమ్మం: పాలేరు అధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలా జరిగిన పాలేరులో మాత్రం లంచం తీసుకుని పోస్టింగ్ ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. శనివారం పాలేరులోని కుసుమంచి మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ‘అధికారులు నా జ్ఞానేంద్రియాలు వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో ఎక్కడ ఎలా జరిగిన పాలేరులో మాత్రం లంచం…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఆమె రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాకం గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీకి ఉద్యాగాలు వచ్చాయి.. తెరాస్ ను తప్పించండి.. కాంగ్రెస్ ను తీసుకుని రండి..
తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆమె ఇప్పుడు పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని వైఎస్ ఆర్ టీపీ నిర్ణయించిందన్నారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సీట్ల వివాదం కొనసాగుతుంది. పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరిగి పోటీ చేయాలని ఆయన అనుచర వర్గం ప్రత్యేకంగా రహస్య సమావేశం అయింది.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేరుకుంది. రహదారిపై పాదయాత్రగా వెళ్తున్న భట్టికి.. కొలిమి వద్ద ఇనుప పని చేసుకుంటున్న బాలాజీ వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తాము మహారాష్ట్ర నుంచి ఇక్కడకు పనిచేసుకునేందుకు వచ్చామని.. పెరిగిన ధరల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
OTR: తెలంగాణలో నిరుద్యోగ సమస్య రెండు ప్రతిపక్ష పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. అప్పటి వరకు రాజకీయ వైరుధ్యం కాని, వ్యక్తిగత వైరం కానీ లేని ఆ పార్టీల నేతలు ఒకే ఒక్క సంఘటనతో బద్ధ శత్రువులుగా మరారు. పరస్పర విమర్శలు చేసుకున్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పై ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పోరాడాలని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారామె. నిరుద్యోగ…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు సీటు చుట్టూ రాజకీయ చర్చ నడుస్తోంది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి MLAగా గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి.. టీఆర్ఎస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై తానే పోటీ చేస్తానని గట్టి ధీమాతో ఉన్నారు. కానీ.. మునుగోడు ఉపఎన్నిక తరుణంలో టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య కుదిరిన దోస్తీ.. పొత్తుల దిశగా అడుగులు వేస్తుండటంతో సీన్ మారిపోతోందన్నది తాజా టాక్. పొత్తు పొడుపుల్లో కుదిరే సర్దుబాటుల్లో పాలేరు చేరుతుందని.. ఆ…
వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. తాను పాలేరు నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వారి కోరిక మేరకు తాను పాలేరు నుంచే పోటీ చేయనున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పాలేరు నియోజక వర్గ కార్యకర్తలతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎంతో మంది వైఎస్సార్ ఫోటో పెట్టుకొని గెలిచారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో…
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఇది బంగారు తెలంగాణ కాదు…బాధల తెలంగాణ అంటూ కేసీఆర్ పాలనపై ఆమె నిప్పులు చెరిగారు. బార్లు – బీర్లు – ఆత్మహత్యల తెలంగాణ గా మారింది రాష్ట్రం. ఉద్యమం చేసిండని కేసిఆర్ ను 2సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఈ ప్రజలకు ఆయన చేసిందేమిటి? https://ntvtelugu.com/anchor-anasuya-fires-on-netizen/ ఎన్నికలప్పుడు గారడీ మాటలు తప్ప కేసిఆర్ తెలంగాణను ఉద్దరించేది ఏమిటి? మళ్ళీ కేసిఆర్ మాటలకు మోసపోవద్దని హితవు పలికారు వైఎస్ షర్మిల.…
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన కామెంట్లు చేశారు. చిల్లర వ్యక్తుల గురించి పట్టించుకోవద్దు..ఓపిక పడితే రాజులు అవుతారు అన్నారు తుమ్మల. రాజకీయాల్లో కావలసింది ఓపిక… ఓపిక పడితే కార్యకర్తలే రాజులు అవుతారన్నారు. అందువల్ల కార్యకర్తలు ఓపిక తో వ్యవహరించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు నియోజకవర్గంలో కార్యకర్తల తో ఆయన మాట్లాడుతూ పరోక్షంగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నుద్దేశించి వ్యాఖ్యానించారు. మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, అయితే మనం…