వైఎస్ షర్మిల ఆరో రోజు పాదయాత్ర.. కేసీఆర్ పాలనపై విమర్శల బాణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ప్రజలకు అనేక సమస్యలున్నాయిని తాను నిరూపిస్తే కేసీఆర్ వెంటనే రాజీనామా చేసి దళితుడ్ని సీఎం చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఒకవేళ ఎలాంటి సమస్యలు లేకపోతే నేను ముక్కు రాసి ఇంటికి వెళ్ళి పోతానని.. దమ్ము ధైర్యం ఉంటే ఈ సవాల్ ను స్వీకరించాలన్నారు. బంగారు తెలంగాణలో బడి పిల్లలు టాయిలెట్ పరిస్థితి ఇది.. సిగ్గు సిగ్గు..ఆడపిల్లలకు నాణ్యమైన టాయిలెట్ వసతి కల్పించలేని కేసీఆర్ ఎందుకయ్యా నీకు ముఖ్యమంత్రి పదవి..పరిపాలన చాతకాకపోతే పర్మినెంట్ గా ఫామ్ హౌస్ లనే పడుకోవాలన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయంటే రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో మోడీ ఇద్దరే కారణమన్నారు. కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, అందుకే ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు షర్మిల.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 6వ రోజుకి చేరుకుంది. మహేశ్వరం నియోజకవర్గం తుమ్మలూరు నుంచి ప్రారంభమైంది పాదయాత్ర. తుమ్మలూరులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైఎస్ షర్మిల. మొహబత్ నగర్ క్రాస్ తుమ్మలూరు గేట్ – రాచలూరు గేట్ మీదుగా పాదయాత్ర సాగింది.
అనంతరం కందుకూర్ మండలం బైరాగిగూడ లేముర్ క్రాస్ మీదుగా పాదయాత్ర సాగింది. లేముర్ గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. అగరమియాగూడ గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు వైఎస్ షర్మిల.మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్రను పునఃప్రారంభిస్తారు. 3:30 గంటలకు లేమూర్ క్రాస్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజలతో మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొంటారు. వారి నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరిస్తారు.
తెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సోమవారం నాటికి పాదయాత్ర ఆరవ రోజుకు చేరుకుంది. ఈ నెల 20వ తేదీన ఆమె రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో తన పాదయాత్రను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలోమొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగనుంది. 26 సమన్వయ కమిటీలు వైఎస్ షర్మిల కోసం పనిచేస్తున్నాయి. ఐదవ రోజు పాదయాత్రలో షర్మిలను కలిసి సంఘీభావం ప్రకటించారు వైవీ సుబ్బారెడ్డి.
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?