Y. S. Sharmila: నిర్మల్ జిల్లాలో YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. కేసీఅర్ పై విమర్శలు గుప్పించారు. దళిత బందు ను కాస్తా అనుచరుల బందు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. తెలంగాణ లో రైతుకు విలువే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్పు లేని రైతు లేనే లేడని తెలిపారు. రుణమాఫీ అని రైతులను మోసం చేశాడు కదా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు హత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఅర్ లో కనీసం చలనం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఛాతీలో ఉన్నది గుండె కాదు బండ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగాలు అడిగితే హమాలి పని బెస్ట్ అంటున్నారని మండిపడ్డారు. దొడ్డు బియ్యం ఇస్తూ రేషన్ దుకాణాల్లో నిత్యావసర వస్తువులను బంద్ పెట్టాడని ఎద్దేవ చేశారు.
read also: MS Dhoni: కోళ్ల వ్యాపారంలో ధోని దూకుడు.. వామ్మో కేజీ అంతా !
పేదవాడు ఎలా బ్రతుకుతున్నారు అని చుసే వ్యవస్థ లేదని మండిపడ్డారు. కనీసం ఒక అధికారి కూడా ప్రజల వైపు చుసే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో 13 లక్షల పెన్షన్ల దరకాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రజల పట్ల నిలబడే వ్యవస్థ లేదని అన్నారు. కేసీఅర్ అరాచకాలను ప్రతి పక్షాలు ప్రశ్నించలేదని షర్మిళ అన్నారు. కాళేశ్వరం లో 70 వేల కోట్ల అవినీతి జరిగితే నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ దొంగలే..వారి వాటాలు వారికి వస్తే చాలంటూ దుమ్మిత్తిపోసారు. కేసీఅర్ ప్రభుత్వం ఇళ్లులు కట్టే ప్రభుత్వం కాదని మండిపడ్డారు. పథకాలను అమలు చేసే ప్రభుత్వం కాదని అన్నారు. పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం కాదని, దళిత బందును కాస్తా అనుచరుల బందు చేశారని మండిపడ్డారు. కేసీఅర్ ప్రతి వర్గాన్ని వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ పాలన తీసుకు రావడం కోసమే పార్టీ అని గుర్తు చేశారు. వైఎస్సార్ బిడ్డను పులి బిడ్డను..వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తాఅని వైఎస్ షర్మిళ తెలిపారు.