Couple Arrested: ఘరానా దంపతులు.. నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తిన భర్తకు సపోర్టుగా భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Couple Arrested: బడా వ్యాపారవేత్తగా బిల్డప్ ఇస్తూ మ్యాట్రిమోనీ వెబ్ సైట్ల ద్వారా పెళ్లికి యత్నిస్తున్న ఘరానా జంటను సీసీఎస్ స్పెషల్ జోన్ క్రైమ్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యెలిగంటి రంజిత్ అలియాస్ రాధాకృష్ణ అలియాస్ రాకేష్, సంధ్య దంపతులు. ఉప్పల్ పరిధిలోని ఫిర్జాదిగూడలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. 2022లో వారి సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ.. తెలుగు మ్యాట్రిమోనీ వెబ్ సైట్లను తనిఖీ చేశాడు. ఆ సమయంలో చాలా మంది యువతులు పెళ్లి కోసం మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో ప్రొఫైల్స్ అప్‌లోడ్ చేయడం గమనించాడు. దీంతో నిత్య పెళ్లి కొడుకుగా అవతారమెత్తాడు. యాప్‌లో ప్రొఫైల్ చూసి పెళ్లికి సిద్ధమయ్యాక.. నేను ఫలానా దగ్గర పని చేస్తున్నా.. నీ జీతం ఎంత.. నేను బిల్డర్‌ని, నా వెంచర్ ఓ రేంజ్ లో నడుస్తోంది.. నేను చాలా ధనవంతుడిని అంటూ యువతులను పరిచయం చేసుకున్నాడు. అతని భార్య కూడా సహకరించి పరిస్థితిని బట్టి వేషం మార్చుకుంటూ వచ్చింది.
Read also: Sharathulu Varthisthai : షరతులు వర్తిస్తాయి మూవీకి క్లీన్ యు సర్టిఫికెట్..
Also Read
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
అతడిపై యువతులకు నమ్మకం కుదరగానే.. ఆ తర్వాత తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని.. కట్నం డబ్బుల్లోంచి కట్ చేసుకోవచ్చని చెప్పి నమ్మించడం స్టార్ట్ చేస్తాడు. దీంతో ఆ తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. అంతే వ్యవహారంలో భర్తకు భార్యకూడ తోడు ఉండటం వలన కొద్ది రోజులు వీరి భాగోతం అలా సాగింది. ఈ ఘటనపై కొందరు బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్‌స్పెక్టర్ భిక్షపతి నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది. నిందితులపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పదుల సంఖ్యలో బాధితులు లక్షల్లో మోసపోయినట్లు విచారణలో తేలింది. షాదీ.కామ్, ఇతర మ్యాట్రిమోనియల్ సైట్‌లలో వివాహ సంబంధాల కోసం వెతుకుతున్నప్పుడు, వారి ప్రొఫైల్‌ను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ జంట ఎవరైనా మోసపోయినట్లయితే, వారు పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Pratibha Patil: జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఇబ్బంది.. ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!