చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగు తూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.
read also : తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం : సీఎం కేసీఆర్
అయితే.. తాజాగా టీఆర్‌ఎస్ ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. అందులో ఎమ్మెల్యేకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసినవారు జాగ్రత్తగా ఉండాలని, టెస్టులు చేయించుకోవాలని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కోరారు.