Site icon NTV Telugu

Beerla Ilaiah: రైతు ధర్నా అని కామెడీ షో నిర్వహించాడు.. కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు

Mla Beerla Ilaiah

Mla Beerla Ilaiah

మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ నల్లగొండలో రైతు ధర్నా అని కామెడీ షో నిర్వహించాడని విమర్శించారు. నల్లగొండలో రైతు ధర్నా అట్టర్ ప్లాప్ అయింది.. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ధర్నాకు మద్దతు తెలుపలేదని బీర్ల ఐలయ్య ఆరోపించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండను తీర్చి దిద్దుతున్నారు.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. ఈ- ఫార్ములా కార్ రేసులో అడ్డంగా దొరికి పోయిన దొంగ కేటీఆర్.. దొంగే దొంగ అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని బీర్ల ఐలయ్య అన్నారు.

Read Also: Canada: ట్రంప్ దారిలోనే కెనడా.. అక్రమ వలసదారుల్ని బహిష్కరిస్తానన్న పీఎం అభ్యర్థి..

కేటీఆర్ రైతులపై ముసలి కన్నీరు కారుస్తున్నాడు.. వ్యక్తి గత ఇమేజ్ కోసం రైతులను వాడుకోవాలని చూస్తున్నాడని బీర్ల ఐలయ్య తెలిపారు. ఎస్ఎల్బీసీ, డిండి, ఉదయసముద్రం ప్రాజెక్టును పట్టించుకోకుండా నల్లగొండ జిల్లా ప్రజలను మోసం చేశాడని కేటీఆర్ పై మండిపడ్డారు. ఈ నెల 26,529 కోట్లు రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి.. కేవలం నల్లగొండలో 100 కోట్లు రైతుల ఖాతాలో టిక్ టిక్ మని డబ్బులు పడితే కేటిఆర్ చెవులు దొబ్బాయా? అని దుయ్యబట్టారు.

Read Also: Meerpet Murder Case: పక్కా ప్రణాళిక ప్రకారం హత్య.. సీపీ సంచలన విషయాలు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో పాటు రైతు కూలీలను ఆదుకుంటుందని బీర్ల ఐలయ్య తెలిపారు. పది ఏండ్లలో రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసింది మీరు కాదా..? అని కేటీఆర్ ను దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటీఆర్‌కు, బీఆర్ఎస్ కు తప్పకుండా తెలంగాణ ప్రజలు బుద్ది చెప్తారన్నారు. నల్లగొండ నుండే కేటీఆర్ పతనం స్టార్ట్ అయిందని ఆరోపించారు. మరోవైపు.. కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అవార్డులు ఇచ్చే ధోరణిలో ఉంది.. కేవలం గద్దర్ వాళ్ళ పార్టీ కార్యకర్త మీద పాట పాడిండని బండి సంజయ్ మాట్లాడుతున్నాడని బీర్ల ఐలయ్య పేర్కొ్న్నారు.

Exit mobile version