Meerpet Murder Case: పక్కా ప్రణాళిక ప్రకారం హత్య.. సీపీ సంచలన విషయాలు
- మీర్‌పేట్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన సీపీ
- అంతకముందు గురుమూర్తి ఇంట్లో, మీర్‌పేట్ పెద్ద చెరువు వద్ద సీన్ రీ-కన్‌స్ట్రక్షన్
- భార్య వెంకట మాధవిని కిరాతంగా హత్య చేసిన గురుమూర్తి అరెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో మీర్‌పేట్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. కాగా భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి చంపినట్లు నిన్న పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో రాచకొండ సీపీ సుధీర్ బాబు సంచలన విషయాలు మీడియాకు తెలిపారు. 16వ తేదీ ఉదయం 8 గంటలకు నిద్రలేచిన వెంటనే మాధవి గురుమూర్తిల మధ్య గొడవ స్టార్ట్ అయిందని అన్నారు. గొడవ కావడంతో మాధవిని చంపాలని గురుమూర్తి అనుకున్నాడు.. అందుకోసమే ఆమెని కొట్టాడని సీపీ వెల్లడించారు. ఆమె చెంపపై కొట్టడంతో గోడకు తాకి కుప్పకూలిపోయింది.. వెంటనే ఆమె స్పృహ కోల్పోయినా, ఆమెను చంపాలన్న ఉద్దేశంతో ఆమె గొంతు పిసికి చంపాడని తెలిపారు. ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాడు.. ఆ తర్వాత మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించాడు.. మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళాడు.. కిచెన్‌లో నుండి కత్తి తీసుకొని వచ్చాడని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
Read Also: Mumbai: పెట్రోల్, డీజిల్ వాహనాలు బ్యాన్.. ఫడ్నవిస్ ప్రభుత్వం ప్లాన్!
Also Read
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
మొదట మాధవి భుజాలను కట్ చేశాడు.. డెడ్ బాడీ నుండి చేతులను వేరు చేశాడు.. ఆ తర్వాత డెడ్ బాడీ నుండి కాళ్లను కూడా వేరు చేశాడు.. కాళ్లు, చేతులను ముక్కలు ముక్కలుగా చేశాడు.. ముక్కలుగా చేసిన కాళ్లు చేతుల భాగాలను బకెట్లో వేశాడని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఆ తర్వాత బకెట్లో వాటర్ హీటర్ పెట్టాడు.. ఆ తర్వాత శరీర భాగాలను అందులో వేసి ఉడికించాడు.. ఆ తర్వాత బకెట్లోంచి ఆ భాగాలను తీసి స్టవ్ పై ఉంచాడన్నారు. అనంతరం ఎముకలను రోటిలో దంచి పౌడర్ చేశాడు.. ఆ పౌడర్‌ను బాత్రూంలోకి వెళ్లి అనేక సార్లు ఫ్లెష్ చేశాడు.. మరికొన్ని చిన్నచిన్న ఎముకలను డస్ట్ బిన్ లో ఉంచాడని సీపీ వెల్లడించారు. నిందితుడు గురుమూర్తి కిచెన్ డోర్, ఇంట్లో, కిటికీలు తలుపులు తెరిచి ఉంచే ఇదంతా చేశాడని అన్నారు. సుమారు 8 గంటల పాటు బాడీని మొత్తం ముక్కలుగా చేసి పౌడర్ గా చేశాడు.. డిటర్జెంతో పాటు ఫినాయిల్ ఉపయోగించి ఎవిడెన్స్ లేకుండా చేశాడని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.
Read Also: KTR: మహాత్మా గాంధీ యూనివర్సిటీకి కేటీఆర్.. విద్యార్థులు వినతి పత్రం
ఈ ఘటనలో మొత్తం 16 వస్తువులను సీజ్ చేశామని రాచకొండ సీపీ చెప్పారు. గురుమూర్తికి ఏ మాత్రం పశ్చాత్తాపం లేదని సీపీ తెలిపారు. నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు.. ప్రకాశం జిల్లాకి చెందిన గురుమూర్తి.. వెంకట మాధవి జిల్లెలగూడలో ఉంటున్నారని అన్నారు. భార్యను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే.. ముందస్తుగా తన ఇద్దరు పిల్లలను బంధువుల ఇంట్లో ఉంచి వచ్చాడని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే భార్య మాధవి తో గొడవ పెట్టుకున్నాడు.. వెంకట మాధవిని కొట్టాడు.. గోడకు వేసి అదిమాడు.. మాధవి పైన కూర్చుని గొంతు నులిమాడు.. ఊపిరి ఆగిపోయేంత వరకు గొంతు నులిమాడని సీపీ ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. మాధవిని హత్య చేసి బూడిద చేసి చెరువులో పారేసిన తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చాడని సీపీ చెప్పారు. పిల్లలకు తల్లిపై లేనిపోని మాటలు చెప్పాడు.. మీ మమ్మీ నాతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నమ్మించాడు.. అత్త, మామలకు కూడా ఇదే విషయం చెప్పాడన్నారు. గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు.. ఆధారాలు దొరికిన తర్వాత కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. మాధవిని పక్కా ప్రణాళిక ప్రకారం గురుమూర్తి హత్య చేశాడు.. క్షణికావేశంలో చేసిన హత్య కాదన్నారు. నిందితుడు గురుమూర్తిని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం.. ఇంకా ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుస్తాయని సీపీ చెప్పారు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!