Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- బీబీనగర్ వద్ద సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
- బ్రేక్ లైనర్ రాపిడితో పొగలు, మంటలు
- అప్రమత్తమైన కో-పైలట్.. అత్యవసరంగా రైలు నిలిపివేత
- ఫైర్ సిబ్బంది, రైల్వే సిబ్బంది చర్యలతో తప్పిన ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సమీపంలో బుధవారం రోజున సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగజ్‌నగర్ వైపు వెళ్తున్న ఈ రైలు బీబీనగర్ స్టేషన్ దాటుతున్న సమయంలో హఠాత్తుగా పొగలు, మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో రైలులో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
అలర్ట్ చేసిన కో-పైలట్.. నిలిచిపోయిన రైలు
రైలు చక్రానికి బ్రేక్ లైనర్ గట్టిగా ఒరుసుకుపోవడంతో తీవ్రమైన ఘర్షణ ఏర్పడి, పొగలతో పాటు మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ సాంకేతిక సమస్యను వెంటనే గమనించిన కో-పైలట్ క్షణాల్లో అప్రమత్తమై లోకో పైలట్‌ను హెచ్చరించారు. దీంతో సమయస్ఫూర్తితో స్పందించిన లోకో పైలట్ వెంటనే రైలును అత్యవసరంగా నిలిపివేశారు. రైలు ఆగడంతో ప్రయాణికులు వేగంగా కిందకు దిగిపోయారు.
Also Read
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
మంటలను అదుపు చేసిన ఫైర్ ఇంజన్లు
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆర్పివేత చర్యలు ప్రారంభించాయి. ఫైర్ సిబ్బంది , రైల్వే సిబ్బంది సంయుక్తంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి ప్రమాదాన్ని అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభవించలేదు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
తాజావార్తలు
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!