NTV Telugu Site icon

Yadadri: పాఠశాల నుండి ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కొడుకుని కొట్టి చంపిన తండ్రి..

Yadadri

Yadadri

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన కొడుకు ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కన్న కొడుకుని కొట్టి చంపాడు ఓ తండ్రి.. ఈ ఘటన చౌటుప్పల్ రూరల్ ఆరేగూడెం గ్రామంలో జరిగింది. అయితే పాఠశాలలో ఓ అవార్డ్ ప్రోగ్రాంలో పాల్గొన్న కొడుకు.. అక్కడ ఆలస్యం అయింది. ఈ క్రమంలో ఇంటికి ఆలస్యంగా రావడంతో కొడుకు భానుని(14) తండ్రి సైదులు కొట్టి చంపాడు. అయితే.. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించకుండా ఖననం చేసే ప్రయత్నం చేశారు కుటుంబసభ్యులు. కాగా.. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారి ఇంటికి వెళ్లారు. ఈ ఘటనపై ఆరా తీశారు. అనంతరం.. భాను మృతదేహాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో.. పోలీసులకు, భాను కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Read Also: Donald Trump: ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై పుతిన్‌తో మాట్లాడాను: ట్రంప్..

అయితే.. ఏ తండ్రైనా కొడుకును ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడగాలి కానీ.. ఇలా కొట్టి చంపుతారా. కొట్టి చంపేంత తప్పు ఆ బాలుడు ఏం చేశాడు. చిన్న తప్పులకు కూడా ఇలా ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది. 14 ఏళ్లు పెంచి పెద్ద చేసిన తర్వాత.. ఇలా కన్న కొడుకును చంపుకునేంత దౌర్భాగ్యం మరేముండదు. ఇలా.. అమాయక బాలుడిని కొట్టి చంపిన తండ్రిని ఏం చేయాలి. ఇలాంటి తండ్రులకు ఎలాంటి శిక్షలు విధిస్తే మంచిది.

Read Also: IMEC: మోడీ-ట్రంప్ భేటీలో కీలకంగా ‘IMEC’ ప్రాజెక్ట్.. చైనాకి ప్రత్యామ్నాయం.. అదానీ కీలక పాత్ర..