NTV Telugu Site icon

KTR: చార్మినార్ ను తొలగించడం అంటే హైదరాబాదీని అవమానించినట్లే..

Brs Ktr

Brs Ktr

KTR: చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించినట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. పదేళ్లలో సాధించిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికార చిహ్నం మార్పును వ్యతిరేకిస్తూ చార్మినార్ వద్ద మాజీ మంత్రులు పద్మారావుగౌడ్, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌లను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రాజముద్రను మారుస్తోందన్నారు.

Read also: TS State Emblem: ఇదిగో కొత్త లోగో.. ఫొటో వైరల్..

చార్మినార్ అనగానే హైదరాబాద్ అందరికీ గుర్తుంటుందని అన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించవద్దని సూచించారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేస్తోందన్నారు. ఇంత త ర్వాత రాజముద్ర మార్చాల్సిన అవ స రం ఏంట ని ప్ర శ్నించారు. హైదరాబాద్‌ అభివృద్ధిని కాంగ్రెస్‌ ప్రభుత్వం చూడలేదని విమర్శించారు. కేసీఆర్ పేరు కనిపించకుండా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోగో నుంచి చార్మినార్‌ను తొలగించడం హైదరాబాదీలను అవమానించడమే. అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదన్నారు. అధికార చిహ్నం మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అధికారిక చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు.

Read also: CM Revanth Reddy: నేడు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమావేశం..

హైదారాబాద్ ఐకాన్ గా చార్మినార్ ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిందన్నారు. రేవంత్ రెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, ఆయనకు తెలంగాణ చరిత్ర గురించి తెలియదన్నారు. కేసీఆర్ పెట్టిన గుర్తులు మార్చి రాక్షసానందం పొందాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని తెలిపారు. అధికారంలో ఉండి ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి తప్ప గుర్తుల్లో కాదన్నారు. కాకతీయ కళాతోరణాన్ని ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ కు ఇరువైపులా పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చార్మినార్ 400 ఏళ్ల ఉత్సవాలను కూడా నిర్వహించిందన్నారు. అమరవీరుల స్థూపం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడమంటే హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉంటుందన్నారు. అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదన్నారు. ఇప్పటికే ఉన్న వాటిని తొలగించవద్దని కోరుతున్నామన్నారు. బీఆర్ఎస్ తరపున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏకంగా 1200 మంది..!

Show comments