KTR: చార్మినార్ ను తొలగించడం అంటే హైదరాబాదీని అవమానించినట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: చార్మినార్‌ను తొలగించడం అంటే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించినట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. పదేళ్లలో సాధించిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికార చిహ్నం మార్పును వ్యతిరేకిస్తూ చార్మినార్ వద్ద మాజీ మంత్రులు పద్మారావుగౌడ్, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్లను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రాజముద్రను మారుస్తోందన్నారు.
Read also: TS State Emblem: ఇదిగో కొత్త లోగో.. ఫొటో వైరల్..
Also Read
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
చార్మినార్ అనగానే హైదరాబాద్ అందరికీ గుర్తుంటుందని అన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించవద్దని సూచించారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేస్తోందన్నారు. ఇంత త ర్వాత రాజముద్ర మార్చాల్సిన అవ స రం ఏంట ని ప్ర శ్నించారు. హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చూడలేదని విమర్శించారు. కేసీఆర్ పేరు కనిపించకుండా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోగో నుంచి చార్మినార్‌ను తొలగించడం హైదరాబాదీలను అవమానించడమే. అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదన్నారు. అధికార చిహ్నం మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అధికారిక చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు.
Read also: CM Revanth Reddy: నేడు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమావేశం..
హైదారాబాద్ ఐకాన్ గా చార్మినార్ ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిందన్నారు. రేవంత్ రెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, ఆయనకు తెలంగాణ చరిత్ర గురించి తెలియదన్నారు. కేసీఆర్ పెట్టిన గుర్తులు మార్చి రాక్షసానందం పొందాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని తెలిపారు. అధికారంలో ఉండి ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి తప్ప గుర్తుల్లో కాదన్నారు. కాకతీయ కళాతోరణాన్ని ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ కు ఇరువైపులా పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చార్మినార్ 400 ఏళ్ల ఉత్సవాలను కూడా నిర్వహించిందన్నారు. అమరవీరుల స్థూపం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడమంటే హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉంటుందన్నారు. అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదన్నారు. ఇప్పటికే ఉన్న వాటిని తొలగించవద్దని కోరుతున్నామన్నారు. బీఆర్ఎస్ తరపున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏకంగా 1200 మంది..!
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు