* నేడు ఉదయం 11 గంటలకి టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు.. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న చంద్రబాబు.. తాజా రాజకీయ పరిణామాలు.. జిల్లా అధ్యక్షుల ఎంపికపై చర్చ.. రాష్ట్ర కమిటీ, ఇతర అంశాలపై చర్చించనున్న సీఎం.. ఇవాళ సీఎం చంద్రబాబుకు తిరువూరు నివేదిక..
* నేడు తిరుపతిలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. 8గంటలకి తిరుపతి చేరుకోనున్న డిప్యూటీ సీఎం.. తిరుపతి జిల్లాలో ఎర్రచందనం డిపో పరిశీలన.. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై సమీక్ష..
* నేడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న పీపీఏ టీమ్.. డ్యామ్, డయాఫ్రం వాల్ పనులను పరిశీలించనున్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో..
* నేటి నుంచి తెలంగాణలో తెరుచుకోనున్న ప్రైవేట్ విద్య సంస్థలు.. కాలేజీల యాజమాన్యాలు రూ. 1500 కోట్లు అడిగ్గా.. ఇప్పటికే రూ. 600 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్..
* నేడు తిరుమలలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి భారీగా క్యూ కట్టిన జనం..
* నేడు వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన.. నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న మోడీ..
* నేడు బీహార్ లో బీజేపీ కీలక నేతల ప్రచారం.. ప్రచార సభల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్..
* నేటి నుంచి ఆఫ్రికాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఈ నెల 11 వరకు అంగోలాలో పర్యటించనున్న రాష్ట్రపతి.. అనంతరం బోట్స్ వానాలో పర్యటించనున్న ముర్ము..
* నేడు ఆస్ట్రేలియా- భారత్ మధ్య ఐదో టీ20.. బ్రిస్బేన్ వేదికగా మధ్యాహ్నం 1.45 గంటలకి మ్యాచ్ ప్రారంభం.. ఐదు టీ20ల సిరీస్ లో 2-1 ఆధిక్యంలో భారత్..