Ponguleti: ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు సాగునీటికి త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో ఆయన మాట్లాడుతూ.. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టారు. కాలేశ్వరం మహా ప్రాజెక్టు అన్నారు.. రైతులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పుంగిపోయి కొట్టుకొని పోతున్న కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Supreme Court: పక్షులు అంతరించిపోతున్నాయి.. వాతావరణ మార్పులపై తొలిసారిగా సుప్రీంకోర్టు ఆదేశం
కాంగ్రెస్ వల్ల కరువు రాలేదు బీఆర్ఎస్ పరిపాలన వల్లే కరువు వచ్చిందని మండిపడ్డారు. సాగు తాగునీటికి కరువు వచ్చిందని కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు సాగునీటికి త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పాటుగా బీర్ ఎస్ తో పాటుగా బీ టీమ్ బీజేపీకి కూడా కర్రు కాల్చి కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.
Read also: MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట..!
గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కి పొంగులేటి శ్రీనివాస్ చేసిన సవాల్ పూర్తిగా విజయవంతమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్‌ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వనని పొంగులేటి చేసిన శపథం నెరవేరింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాలకు గాను ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొందగా, పొత్తుల నేపథ్యంలో సీపీఐకి కేటాయించిన కొత్తగూడెంలో కూడా కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించింది. కాగా, భద్రాచలం స్థానంలో ప్రముఖ వైద్యుడు తెల్లం వెంకటరావు బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆయన విజయం సాధించినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది.
Nizamabad: ప్రాణం తీసిన కారు.. ఊపిరాడక బాలుడు మృతి