Warangal Man Cheated Girl In The Name of Love Who Met Through Instagram: ఆ ఇద్దరికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. డైలీ చాటింగ్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకోవాలని ఫిక్స్ అవ్వడంతో.. ఇద్దరు కలిసి సహజీవనం చేశారు. తీరా అమ్మాయి గర్భం దాల్చాక.. అసలు ట్విస్ట్ వెలుగు చూసింది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆ అబ్బాయి.. అబార్షన్ చేసుకోమ్మని షాకిచ్చాడు. లేదంటే.. యాసిడ్ దాడి చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో మోసపోయాననుకున్న ఆ యువతి.. న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Himanta Biswa Sarma: అస్సాంలో మదర్సాలను మూసివేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని నివసిస్తున్న ఓ యువతి (22).. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ అమ్మాయికి 2020లో వరంగల్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ బూక్యా కల్యాణ్(25)తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. తరచూ చాటింగ్ చేసుకోవడంతో.. ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక అప్పటి నుంచి వీళ్లిద్దరు కలిసి షికార్లు కొట్టడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకుంటానని కల్యాణ్ నమ్మించడంతో.. అతనితో ఆ యువతి శారీరక సంబంధాలు కొనసాగించింది. ఇద్దరు కలిసి సహజీవనం చేశారు. ఈ క్రమంలోనే ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తన ప్రియుడికి చెప్పగా.. అతడు ఊహించని షాక్ ఇచ్చాడు. అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ‘ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా.. అబార్షన్ ఎందుకు?’ అని ఆ అమ్మాయి నిలదీస్తే.. అప్పుడు కల్యాణ్ తన అసలు రంగు బయటపెట్టాడు. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, కేవలం సరదా తీర్చుకోవడం కోసమే కలిసి ఉంటున్నానంటూ బాంబ్ పేల్చాడు.
Heartbreak Insurance Fund: భలే ఐడియా.. లవ్ బ్రేకప్‌తో డబ్బులు
తాను చెప్పినట్టు అబార్షన్ చేయించుకోకపోతే.. యాసిడ్ పోసి చంపేస్తానని కల్యాణ్ బెదిరించాడు. అంతేకాదు.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, స్పందించకుండా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో బాధితురాలు నేరుగా కల్యాణ్ స్వగ్రామానికి వెళ్లింది. అక్కడికి వెళ్లి అతడ్ని ఆరా తీసింది. అప్పుడు మరో షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. అప్పటికే అతనికి మరో యువతితో నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు తేలింది. ప్రేమ పేరుతో తనని ఎందుకు మోసం చేశావని ప్రశ్నిస్తే.. రూ.10 లక్షలు కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటానని కండీషన్ పెట్టాడు. దాంతో.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 493, 420, 417,313 506, వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.