Heartbreak Insurance Fund: ప్రేమ ఎప్పుడు..? ఎలా..? ఎందుకు? పుడుతుందో కూడా తెలియదు.. దానికి కులం, గోత్రం, మతం, ప్రాంతం, దేశం.. ఇలా దేనితో సంబంధం లేదు.. అయితే. ఇటీవలి కాలంలో ప్రేమలో పడడం సంగతి అటుంచితే.. బ్రేకప్‌లు కూడా అంతే ఈజీగా జరిగిపోతున్నాయి.. ప్రేమికుల మధ్యలోకి ఎవరైనా కొత్త వ్యక్తి ఎంట్రీ ఇస్తే చాలు.. బ్రేకప్ చెప్పుకుని మరో వ్యక్తితో కలిసిపోతున్న ఘటనలు ఈ మధ్య ఎన్నో వెలుగు చూశాయి.. వీటితో కొందరు దేవదాసులుగా, దేవదాసిలుగా మిగిలిపోతే.. కొందరు మాత్రం.. ఆ పెయిన్ లేకుండా.. గడిపేస్తున్నారు. అయితే, ఓ ఐడియా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. బ్రేకప్ అయిన తర్వాత ఓ యువకుడి డబ్బులు వచ్చాయి? సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేయడంతో.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.. ఆ న్యూస్..
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇంతకీ, లవ్ బ్రేకప్ అయితే.. డబ్బులు రావడం ఏంటి? అది ఎలా సాధ్యం.. ఇన్సూరెన్స్ చూశాం, హెల్త్ ఇన్సూరెన్స్ చూశాం.. ఈ లవ్ బ్రేకప్ ఇన్సూరెన్స్ ఏంటి? కొత్తగా ఉంది.. అనే వివరాల్లోకి వెళ్తే.. ప్రేమలో పడిన ఓ జంట ముందుగానే జాగ్రత్త పడింది. వారు ఓ నిబంధన పెట్టుకున్నారు.. దానికి హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ అని పేరు కూడా పెట్టేశారు.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది.. @Prateek_Aaryan అనే వ్యక్తి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాల ప్రకారం.. ప్రతీక్ కొద్ది రోజుల క్రితం ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రిలేషన్‌ను మొదలు పెట్టేముందే ప్రతీక్, అతని ప్రేయసి మధ్య ఓ ఒప్పందం జరిగింది.. ఆ నిబంధన ప్రకారం ప్రతి నెలా ఇద్దరూ కలిసి రూ.500 ఓ ఖాతాలో జమ చేయాలి. భవిష్యత్తులో ఎవరైతే మోసపోతారో వారికి ఆ డబ్బు మొత్తం దక్కేలా కండీషన్స్‌తో.. `హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్` పేరుతో డబ్బులు జమ చేస్తూ వచ్చారు.. కానీ, ఇటీవల ప్రతీక్‌ను అతడి ప్రేయసి గుడ్‌బై చెప్పేసింది. మరో యువకుడికి క్లోజ్‌గా మూవ్ అయ్యింది.. దీంతో.. అప్పటి వరకు వారిద్దరూ కలిసి దాచుకున్న మొత్తం రూ.25 వేలు ప్రతీక్‌కు దక్కాయి. ఈ విషయాన్ని ప్రతీక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. దానిపై ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. గొప్ప ఐడియా అంటూ కొందరు పొగిడేస్తుంటే.. లవ్‌పై కూడా ఇలాంటి ఇన్సూరెన్స్ ఉందా? అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/Prateek_Aaryan/status/1636009507238346753