Vikarabad: వికారాబాద్ కలెక్టర్‌కు నిరసన సెగ.. రాళ్ల దాడి
- వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత
- ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ రసాభాస
- ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ గ్రామస్తుల ఆగ్రహం
- జిల్లా కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై దాడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు గ్రామాస్తులు చుక్కలు చూపించారు. ఫార్మా కంపెనీని గ్రామాస్తులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అభిప్రాయ సేకరణకు వచ్చిన రెవెన్యూ సిబ్బందితో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. అటు అధికారులు.. ఇటు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఆ తర్వాత గ్రామస్తులు సంయమనం కోల్పోయారు. జిల్లా కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై దాడికి దిగారు. దీంతో.. వారు పరుగులు పెట్టక తప్పలేదు. కానీ వారు కారెక్కిన గ్రామస్తులు వదిలిపెట్టలేదు. కార్లపైన కూడా దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు.
Read Also: Kiran Abbavaram : “క” మూవీ టీమ్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంస
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారిపై కూడా దాడి చేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని ఎక్కడికక్కడ చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. దాడి అనంతరం.. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జెన్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. దాడి ఘటనపై వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తో తెలంగాణ సీఎస్ శాంతికుమారి మాట్లాడారు. దుద్యాలలో జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.
Read Also: Prajwal Revanna: రేవణ్ణకి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. అత్యాచారం కేసులో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరణ
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?