Vijayashanti: రెండు రాష్ట్రాల ప్రజలు.. బీఆర్ఎస్‌కు కర్రుకాల్చి వాత పెడతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayashanti Controversial Comments On KCR And BRS Party: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు ట్విటర్ మాధ్యమంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ రూపంలో ఏపీలో బీజేపీకి దెబ్బతీసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టే.. ఏపీ ప్రజల్ని నమ్మింగలుగుతానని కేసీఆర్ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణని అప్పులపాలు చేసిన కేసీఆర్ తీరు ఏపీ ప్రజలకు తెలుసని.. రెండు రాష్ట్రాలు బీఆర్ఎస్‌కి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని పేర్కొన్నారు.
Rishabh Pant: అక్కడ గుంతలేమీ లేవు.. సీఎంకు జాతీయ రహదారుల శాఖ కౌంటర్
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
‘‘ఏపీలో జనసేనను, జనసేనతో సానుకూలమై ఉన్న బీజేపీని నష్టపరిచేందుకు కేసీఆర్ ‘బీఆర్ఎస్’ రూపంలో ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ చేరికల పరిణామమే అందుకు సంకేతాలిస్తున్నాయి. తెలంగాణ ప్రజలను మోసగించినట్లే, ఏపీలోనూ ప్రజలను నమ్మించగలుగుతానని కేసీఆర్ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఏపీలో రాజ్యాధికార అర్హత కలిగిన బలమైన సామాజిక వర్గాన్ని బీజేపీకి దూరం చేసేందుకు కేసీఆర్ బిఆర్ఎస్ పేరుతో చేస్తున్న దుష్ప్రయత్నాన్ని ఏపీతోపాటు తెలంగాణలో రాజకీయంగా వెనక్కు నెట్టివేయబడ్డ అన్ని వర్గాల సముదాయాలు అర్థం చేసుకుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ధనిక తెలంగాణను అప్పులపాలు చేసి, ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ తీరు ఏపీ ప్రజలకి తెలియంది కాదు. రెండు రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్‌కి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం’’ అంటూ విజయశాంతి వరుస ట్వీట్లు చేశారు.
Sunil Kanugolu: హైకోర్టులో సునీల్‌కి చుక్కెదుకు.. పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందే!
అంతకుముందు కూడా.. సర్పంచ్‌లను కేసీఆర్ భిక్షగాళ్లను చేశారంటూ విజయశాంతి నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కారు తీరు చూస్తుంటే.. తన ఇంటిని తానే దోచుకుంటున్న వైనంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల డిజిటల్ కీస్‌ని అధికారుల సాయంతో ఉపయోగించి.. నిధులు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా కరెంట్ బిల్లులు కట్టలేక, కార్మికులకు జీతాలివ్వలేక సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అప్పులు చేసి మరీ గ్రామాభివృద్ధికి పనులు చేయిస్తే.. ఆ బిల్లులు ఇవ్వకపోగా, ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని సైతం లాక్కుంటున్నారని ఆరోపణలు చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. చివరికి భిక్షాటన చేసే పరిస్థితికి సర్పంచ్‌లను దిగజార్చారని విజయశాంతి మండిపడ్డారు.
ఏపీలో జనసేనను, జనసేనతో సానుకూలమై ఉన్న బీజేపీని నష్టపరిచే ప్రయత్నం బీఆరెస్ రూపంలో కేసీఆర్ గారు చేస్తున్నట్లు ఆ రాష్ట్రంలో బీఆరెస్ చేరికల పరిణామాలు సంకేతాలు ఇస్తున్నయి. తెలంగాణ ప్రజలను మోసగించినట్లే ఏపీలోనూ ప్రజలను నమ్మించగలుగుతానని కేసీఆర్ గారు పిచ్చి ప్రయోగాలు చేస్తున్నరు. pic.twitter.com/Yid5cpSDjH
— VIJAYASHANTHI (@vijayashanthi_m) January 3, 2023
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!