అఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు చాలా దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. అయితే.. అఫ్ఘనిస్థాన్ సంక్షోభంపై ఇప్పటికే చాలా మంది స్పందించారు. ఇటు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ..కూడా స్పందించి… తాలిబన్లతో భారత్ చర్చలు జరపాలని రెండు రోజుల క్రితం ట్వీట్ చేశాడు. అయితే.. దీనిపై బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. భారత్లోని ఆఫ్ఘన్ రాయబారి స్వయంగా తాలిబన్లను వ్యతిరేకిస్తూ, ఆ దేశంలో ఇంకా పోరాడుతున్న ఆఫ్ఘనిస్థాన్ ఉపాధ్యక్షుడిని సమర్థించినప్పుడు, తాలిబన్లలతో భారత్ చర్చలు జరపాలని చెప్పడంలో అంతరార్థమేమిటో MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీకే తెలియాలని మండిపడ్డారు. అంతకన్నా, ఒవైసీ జీ స్వయంగా కాబూల్ వెళ్ళి తాలిబన్లలతో చర్చలు జరిపి వచ్చి, సమాచారం అందిస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో కొంత సమంజసంగా ఉంటుందేమో ప్రయత్నిస్తే మంచిదని చురకలు అంటించారు విజయశాంతి. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.