Saptapadhi: ఎడారిలో సప్తపది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saptapadhi: సాధారణంగా ఎడారిలో నడవాలంటేనే భయమేస్తుంది. అంత ఎండలో నడవటం అంటే చాలా కష్టం. అటువంటి ఎడారిలో సప్తపది ఎంటనీ అనుకుంటున్నారా? ఇది ఏదో సరదాపడి చేసుకున్న సప్తపది కాదు.. ఒక యువతిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. వారిలో ఒకరు యువతిని ఎడారిలో గడ్డితో వేసిన మంట చుట్టూ తిప్పుతూ తమ పెళ్లి అయిపోయిందని.. మరెవరిని పెళ్లి చేసుకోవద్దని బెదిరించి విడిచిపెట్టాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read also
Also Read
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
సిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జూన్ 1న చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జైసల్మేర్ జిల్లా మోహన్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన యువతికి ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. జూన్ 12న పెళ్లికి ముహూర్తం పెట్టారు. అయితే జూన్ 1న అదే ప్రాంతానికి చెందిన పుష్పేంద్ర సింగ్ అనే యువకుడు.. మరి కొంత మందితో కలిసి యువతిని కిడ్నాప్ చేశాడు. నిందితుడు పుష్పేంద్ర బలవంతంగా వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. కిడ్నాప్ చేసిన యువతిని ఎడారిలోకి తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆమెను తన చేతులతో ఎత్తుకొని గడ్డితో వేసిన మంట చుట్టూ ఏడుసార్లు తిరిగి పెళ్లి జరిగిపోయిందని.. బాధితురాలికి వార్నింగ్ ఇచ్చాడు. తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని బెదిరించి విడిచిపెట్టాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నిందితుల్లో ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
Read also
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు జైసల్మేర్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమ కుమార్తెకు జూన్ 12న పెళ్లి జరగాల్సి ఉందని తెలిపారు. చాలా రోజుల నుంచి నిందితుడు తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితులు పోలీసులకు తెలిపారు. పెళ్లిని చెడగొడతానని బెదిరించాడని చెప్పారు. నిందితుల్లో ఒకడ్నే పోలీసులు అరెస్ట్ చేశారని, మిగతా వాళ్లను వదిలేశారని యువతి బంధువులు మండిపడుతున్నారు. నిందితుడి ఆస్తులను జప్తు చేశామని.. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు బాధితులకు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..