సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట రామిరెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత వివాదాస్పద వ్యక్తి వెంకట్ రామ్ రెడ్డిఅని… కేసీఆర్ కి ఈయన ప్రీతి పాత్రుడని మండిపడ్డారు. రెవెన్యూ శాఖ మంత్రిగా నియమించే అవకాశం ఉందని… రెవెన్యూ ఆదాయం కొల్లగొట్టేందుకు కేసీఆర్… వెంకట్ రామ్ రెడ్డి తో కలిసి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కుప్పం నియోజక వర్గ అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి వెంకట్ రామ్ రెడ్డి అని మండిపడ్డారు.…
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను హైదరాబాద్‌లోని తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లోని సీఎస్ సోమేష్ కుమార్‌కు అందజేశారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది కలెక్టర్‌గా రిటైర్డ్ కానుండగా ఒక ఏడాది ముందే వెంకట్రామిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. Read Also: రాములవారి కంట కన్నీరు… ఆందోళనలో…
వరి విత్తన విక్రయాలపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ .. వరి విత్తనాలు అమ్మితే షాపు సీజ్ చేసి లైసెన్స్ ర ద్దు చేస్తానని, నేను ఉన్నంత వరకు మళ్లీ షాప్ తెరిచే అవకాశం కూడా ఉండదంటూ సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసి వ్యా ఖ్యలను రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టిందన్నారు. వరి విత్తనాలు అమ్మే విషయంలో హైకోర్టు , సుప్రీంకోర్టు…
రైతు తన నిర్ణయంతో పంటలు వేయకూడదా..? సిద్ధిపేట కలెక్టర్ చెప్పిందే వేయాలా..? సిద్ధిపేట జిల్లా లో ఏ పంట వేయాలనేది కలెక్టర్ నిర్ణయిస్తాడా..? ఏ అధికారంతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నాడంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కలెక్టర్‌పై ఫైర్ అయ్యారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ..అవగాహన లేని వెంకట్రామిరెడ్డి ని కలెక్టర్ గా ఇన్నాళ్లు గా ఎందుకు కొనసాగిస్తున్నారు అని ప్రశ్నించారు. సిద్ధిపేట కలెక్టర్ మాటలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు జగ్గారెడ్డి. రైతులకు అండగా ఉంటాం.…