Vemula Prashant Reddy : మళ్ళీ టోల్ టాక్స్ రేట్లు గనుక పెంచితే “మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఏప్రిల్ 1వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్ర పరిధిలోని NHAI కి సంబందించిన 32 టోల్ గేట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే టాక్స్ ని మళ్ళీ పెంచబోతున్నారని నాకు తెలియవచ్చిందని, ఇప్పటికే మీరు వసూలు చేస్తున్న టోల్ టాక్స్ తెలంగాణ ప్రజలకు పెనుభారంగా మారిందని మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ టోల్ టాక్స్ రేట్లు గనుక పెంచితే “మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు” అవుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా.. ‘ 2014 సంవత్సరంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 600 కోట్లు టోల్ టాక్స్ వసూలు చేస్తే.. దాన్ని ప్రతీ ఏడాది పెంచుకుంటూ పోతూ..ఈ సంవత్సరం 2023లో 1824 కోట్లు వసూలు చేశారు. అంటే ఈ 9 సంవత్సరాలకాలంలో టోల్ టాక్స్ వసూలు 300% పెంచారు. ఈ టోల్ టాక్స్ పెంపువల్ల ట్రక్కుల ద్వారా సరఫరా చేసే నిత్యావసరాల ధరలు పెరిగాయి. సామాన్యులు ప్రయాణించే బస్సు చార్జీలు పెరిగాయి. దీంతో మధ్య తరగతి ప్రజల జీవనం పూర్తి భారంగా తయారయ్యింది. ఇదిలా ఉంటే…
తెలంగాణ నుంచి ఉన్న ఏకైక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు,పలువురు బీజేపీ నాయకులు తరుచూ కేంద్రం జాతీయ రహదారుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం మంజూరీలు కాగితాల మీద కొండంత ఉంటే..ఖర్చు చేసింది మాత్రం గోరంతనే. 2014 నుంచి నేటి వరకు కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 113NH ప్రాజెక్టులు మరియు CRIF వర్క్స్ గాను మొత్తం కలిపి 1,25,176 కోట్లు మంజూరు చేసినట్టు కాగితాల మీద చూపిస్తున్నా.. ఈ 9 సంవత్సరాల్లో ఖర్చు చేసింది కేవలం 20,350 కోట్లు మాత్రమే.
Also Read : Dahi Controversy: తమిళనాడులో “దహీ” వివాదం.. పెరుగు ప్యాకెట్లపై హిందీ పేరు ఉండొద్దన్న సీఎం
Also Read
ఆ ఖర్చు చేసిన 20,350 కోట్లకు గాను జాతీయ రహదారుల సంస్థ గత 9 సంవత్సరాల్లో టోల్ టాక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 9 వేల కోట్ల టోల్ వసూలు చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిన దాంట్లో తెలంగాణ ప్రజల నుంచి ఇప్పటికే సగం డబ్బులు టోల్ టాక్స్ ద్వారా ముక్కుపిండి వసూలు చేశారు. “కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది” అన్న చందంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి. అంతే కాకుండా పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడం ద్వారా మరియు పెట్రోల్,డీజిల్ పై అదనపు రోడ్ సెస్సుల పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి ఈ 9 సంవత్సరాలకాలంలో కేంద్రం ఎన్ని కోట్లు వసూలు చేసింది.? ఆ డబ్బు ఎటు పోతుందో మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లెక్క చెప్పాల్సిన అవసరముందని నేను భావిస్తున్నా.
Also Read : Smoking Break : 14 ఏళ్లలో 4,500 సార్లకు పైగా స్మోకింగ్ బ్రేక్..
కావున.. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం తెలంగాణలో లక్షల కోట్లు ఖర్చు చేసిందని పదేపదే అబద్దాలు ప్రచారం చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలకు ఈ వాస్తవ విషయాలు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ద్వారా మీరు తెలియజేస్తే మంచిది. వారు ప్రజల్లోకి బలవంతంగా జొప్పిస్తున్న అబద్ధాలు, అసత్యపు ప్రసంగాలు మానుకోవాలని సూచించాల్సిన బాధ్యత కూడా మీదే. టోల్ టాక్స్ పెంచుతూ.. పెట్రోల్ డీజిల్ పై సెస్ లు వసూలు చేస్తూ.. సామాన్యులను అరిగోస పెడుతున్న కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా. ఏప్రిల్ 1వ తేదీ నుండి టోల్ టాక్స్ రేట్ల పెంపుదల నిర్ణయాన్ని మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..