Vemula Prashanth Reddy Fires On BJP PM Modi: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేల్పూర్ పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. దేవుని పేరుతో బీజేపీ దేశాన్ని నిలువునా దోచుకుంటోందని ఆరోపించారు. మోడీ, అదాని కలిస్తేనే ప్రధాని అని వర్ణించారు. మోడీ సచ్చీలుడే అయితే.. అదానిపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేవలం రెండు కేసులకు మోడీ, అమిత్ షా కలిసి.. ఏకంగా 22లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. దేశ రక్షణను మోడీ గాలికి వదిలేశారన్నారు. బీబీసీపై ఐటీ దాడులు దుర్మార్గమని మండిపడ్డారు. డబ్బులతో కొను, లేకుంటే జైల్లో వెయ్ అనే సిద్ధాంతంతో బీజేపీ ముందుకు నడుస్తోందన్నారు. ఎమ్మెల్సీ కవితను జైల్లో వేస్తామని బీజేపీ ఎంపీ ఎలా డిసైడ్ చేస్తాడని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని వేధిస్తున్న బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయని.. బీజేపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దేశంలో మోడీ అవినీతి, అరాచక పాలనపై పోరాటం చేస్తోంది ఒక్క సీఎం కేసీఆరేనని పేర్కొన్నారు.
Antony Blinken: ఉక్రెయిన్ పై రష్యా అణ్వాయుధ దాడి చేయకుండా భారత్, చైనాలే అడ్డుకున్నాయి.
అంతకుముందు.. కల్లబొల్లి మాటలు చెప్పి, గ్రామాల్లో ఒక్క పైసా అభివృద్ధి పనులు చేయని వారిని నమ్మొద్దని నమ్మొద్దని ప్రశాంత్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజక వర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దేవుడి పేరుతో, రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి.. ఓట్లు దండుకొని, రైతులను పసుపు బోర్డు పేరిట మోసం చేసిన వ్యక్తిని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. అలాంటి వారికి మరోసారి నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవ చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటానని మాటిచ్చారు. ఏ మత గ్రంథమైనా అందరూ బాగుండాలని చెబుతుందని, అందులో మనం ఉండాలని కోరుకోవాలని అన్నారు. కానీ ఈమధ్య దేశంలో స్వార్థ, వింత పోకడలను చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్నిమతాలు సమానంగా గౌరవించబడుతున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
Singer Amarjeet: బంపరాఫర్ పట్టేసిన ఇసుకబట్టి కార్మికుడు.. ఏకంగా సినిమా ఛాన్స్