Bihar Singer Amarjeet Got Chance To Sing A Song In Sonu Sood Film Fateh: సోషల్ మీడియా పుణ్యమా అని.. కొందరు ఓవర్‌నైట్ సెన్సేషన్స్‌గా అవతరిస్తున్నారు. కామెడీ వీడియోల ద్వారానో, డ్యాన్స్‌తో ప్రతిభ చాటుకునో, పాటలతో మంత్రముగ్ధులో చేసి.. రాత్రికి రాత్రే పాపులారిటీ గడిస్తున్నారు. ఇలాంటి వారి జాబితాలోకి ఇప్పుడు తాజాగా ఓ ఇసుకబట్టీ కార్మికుడు చేరిపోయాడు. బీహార్‌కి చెందిన అమర్జీత్.. తన మధుర గాత్రంతో అందరి మనసులో దోచుకొని, లేటెస్ట్‌గా సినిమా ఛాన్సే కొట్టేశాడు. కొవిడ్ లాక్డౌన్ సమయంలో రియల్ హీరోగా అవతరించిన సోనూసూద్.. అతని ప్రతిభని మెచ్చుకుని, తన తదుపరి సినిమాలో పాట పాడే అవకాశం కల్పించాడు.
Hong Kong: హాంకాంగ్ మోడల్ దారుణ హత్య.. ఫ్రిజ్ లో కాళ్లు.. ఇంకా దొరకని తల
ఇంతకీ ఈ అమర్జీత్ ఎవరు?
బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అమర్జీత్.. ఇసుకబట్టీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అంతకుముందు ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌గానూ పని చేశాడు. ఆ సమయంలోనే ఇతనికి సింగింగ్‌పై మక్కువ ఏర్పడింది. తన గాత్రం బాగుందని చుట్టుపక్కల వారు కొనియాడటంతో.. వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. రీసెంట్‌గా అతడు పాడిన ‘దిల్ దేదియా హై’ అనే పాట బాగా వైరల్ అయ్యింది. ఆ పాటని అతడు పాడిన తీరు, ఎవ్వరైనా ఫిదా అయిపోతారు. అంత అద్భుతంగా రాగాలు తీస్తూ అమర్జీత్ ఆకట్టుకున్నాడు. అది ఎంతలా వైరల్ అయ్యిందంటే.. సోనూసూద్ దాకా చేరింది. అతని పాట విన్న సోనూసూద్.. మరో క్షణం ఆలోచించకుండా తన ‘ఫతే’ సినిమాలో ఓ పాట పాడే అవకాశం కల్పించాడు.
Kalvakuntla Kavitha: మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ భాగస్వామ్యం అవుతుంది
తనకు ఈ ఆఫర్ రావడంతో.. అమర్జీత్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆఫర్‌పై అమర్జీత్ మాట్లాడుతూ.. ‘‘ఎట్టకేలకు నేను ఏ క్షణం కోసం అయితే ఎదురుచూశానో, ఆ సమయం రానే వచ్చేసింది. నాకు సోనూసూద్ సార్ వద్ద నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తన ఫతే సినిమాలో ఓ పాట పాడేందుకు ఆయన అవకాశం ఇచ్చారు. ఈనెల 27వ తేదీన ఆయన్ను కలవడానికి ముంబయి వెళ్తున్నాను. అదే సమయంలో పాటను కూడా రికార్డ్ చేయబోతున్నారు. నేను రెండురోజుల పాటు ముంబయిలో బస చేయనున్నాను. మీరు కనబర్చిన ఈ ప్రేమకు ధన్యవాదాలు’’ అంటూ చెప్పుకొచ్చాడు.