NTV Telugu Site icon

Vemula Prashanth Reddy : నరేంద్ర మోడీ అసమర్థ ప్రధాని

Vemula Prashant On Modi

Vemula Prashant On Modi

నిజామాబాద్ జిల్లా నందిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ అసమర్థ ప్రధాని అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడు మోడీ అని ఆయన అన్నారు. 5జీ స్పెక్ట్రం వేలంలో 15లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, ఆస్ట్రేలియా బొగ్గు దిగుమతి పేరుతో 3లక్షల కోట్ల కుంభ కోణం జరిగిందని ఆయన ఆరోపించారు. దీంతో పాటు.. మోడీ తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపద దోచి పెడుతున్నాడని ఆయన మండిపడ్డారు. కేసిఆర్ పాలన గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కు లేదని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసిన అరవింద్ పత్తాలేడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : British Airways: బ్రిటీస్ ఎయిర్‌వేస్‌లో ఐటీ ఫెయిల్యూర్.. పదుల సంఖ్యలో నిలిచిన విమానాలు..

దేశంలో ఈ రాష్ట్రంలో లేని దళిత బంధు, బీడీ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, రైతుబంధు, తదితర పథకాలను కెసిఆర్ ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు దేశంలోనే ప్రతి రాష్ట్రంలో ప్రారంభించడానికి బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుందని, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సమాయత్తమయ్యారన్నారు. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో అక్కడి ప్రజలకు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పారని, పేద ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ చేస్తున్న పనులు ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

Also Read : Virender Sehwag: అతనిపై పెట్టుకున్న ఆశలన్నీ బుగ్గిపాలు చేశాడు.. తీసిపారెయ్యండి