Virender Sehwag: అతనిపై పెట్టుకున్న ఆశలన్నీ బుగ్గిపాలు చేశాడు.. తీసిపారెయ్యండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virender Sehwag Fires On Dasun Shanaka For Bad Performance In IPL: ఈ ఐపీఎల్ సీజన్‌లో చాలామంది యంగ్‌స్టర్స్ అద్భుతమైన ప్రదర్శనలతో దూసుకుపోతే.. అంచనాలు పెట్టుకున్న కొందరు స్టార్ ఆటగాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. వండర్స్ క్రియేట్ చేస్తారని భావిస్తే, అందుకు భిన్నంగా చెత్త పెర్ఫార్మెన్స్‌లతో జట్టుకి శాపంలా మారారు. అలాంటి ఆటగాళ్లలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక ఒకరు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ఇతగాడు.. ఈ సీజన్‌లో ఒక్కటంటే ఒక్క గొప్ప ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. కేన్ విలియమ్సన్ స్థానంలో ఈ లీగ్‌లోకి అడుగుపెట్టిన అతగాడు.. తనకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు. ప్రతిసారి ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అతగాడు.. కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-1లో అతని నుంచి అందరూ కీలక ఇన్నింగ్స్ ఆశిస్తే.. కేవలం 17 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ సైతం షనకపై నిప్పులు చెరిగాడు.

Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Seediri Appalaraju: జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారు.. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన అరిష్టం
ఈరోజు అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫైయర్-2 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘అహ్మదాబాద్‌లో గుజరాత్ జట్టుని ఓడించడం అంత సులభం కాదు. ఇంతకుముందు వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో.. ముంబై చేతిలో గుజరాత్ ఓటమిపాలైంది. కాబట్టి.. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని హార్దిక్ సేన భావిస్తోంది. అలాంటి జట్టుని ఎదుర్కోవాలంటే.. ముంబై ఇండియన్స్ బాగా కష్టపడాల్సి ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించాలి. ఇప్పుడున్న ముంబై జట్టు పటిష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక గుజరాత్ విషయానికొస్తే.. వారు బౌలింగ్ పరంగా పటిష్టంగానే ఉన్నారు కానీ, బ్యాటింగ్‌లో కాస్త నిలకడ లోపించింది. ముఖ్యంగా.. దాసున్ షనక తీవ్ర నిరాశపరిచాడు. అతడి స్థానంలో ఓడియన్ స్మిత్ లేదా అల్జారీ జోసెఫ్‌ను తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే మనోహర్‌కు అవకాశం ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే.. అతడు భారీ సిక్స్‌లు కొట్టగలడు. షనకపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. అతడు నా అంచనాల్లో కనీసం ఒక్క శాతం కూడా చేరుకోలేకపోయాడు’’ అంటూ చెప్పుకొచ్చాడు.
SSMB28: మహేష్ ఫ్యాన్స్.. సిద్ధం కండమ్మా.. అప్డేట్ వచ్చేసింది
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?