అసలే పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతం అవుతున్న వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్తగా కొనుగోలు చేసే బైక్‌లు, స్కూటర్లపై లైఫ్ ట్యాక్స్ పెరగనుంది. ప్రస్తుతం వాహనం ధర రూ.50 వేల లోపు ఉంటే 9 శాతం, రూ.50 వేలకు మించితే 12శాతంగా లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి మోటర్ వాహనాల ట్యాక్సేషన్ చట్టం-1963లో 3, 6, 7వ షెడ్యూల్‌లోని…