V. C. Sajjanar: పాటించకపోతే మీకే నష్టం..! ప్రైవేట్ బ్యాంకు ఖాతాదారులకు సజ్జనార్ సలహా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V. C. Sajjanar: ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులకు అలెర్ట్ గా ఉండాలని వీసీ సజ్జనార్ సలహా ఇచ్చారు. డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసులు ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ICICI Bank, Yes Bank, RBL Bank, IndusInd Bank, RBL Bank, IDFC First Bank, AU Small Finance Bank తో పాటు Punjab National Bank బ్యాంకుల ఖాతాదారులకు ఫోన్లు చేసి కోట్లలో కుచ్చుటోపీ పెడుతున్నారని అన్నారు. సోషల్ మీడియా సాయంతో బ్యాంక్ ఏజెంట్లను నియమించుకుని.. బ్యాంకు ఖాతాల్లో ఎక్కువగా డబ్బున్న వారికి ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. అక్రమ లావాదేవీలు చేస్తూ ఇండియన్ బ్యాంక్ ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.
Read also: Breaking: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టు లో ఊరట..!
Also Read
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
కావున ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ మొత్తంలో నగదు బదిలీకి బ్యాంకు కరెంట్ ఖాతాలను ఉపయోగించుకోవాలి. అవసరమైతేనే ఒక్కటి రెండు సార్లు ధృవీకరించుకున్నాకే కార్పొరేట్ లాగిన్ లు తెరవాలి. కార్పొరేట్ లాగిన్‌ల సాయంతో పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లు నగదు బదిలీ చేసే అవకాశముంది.. జాగ్రత్త! అని సూచించారు. విదేశాల నుండి ఇండియా బ్యాంక్ ఖాతాలకు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ముఖ్యంగా చైనా, హాంకాంగ్, తైవాన్, థాయిలాండ్, కంబోడియా దేశాల ఐపీ అడ్రస్‌లను బ్లాక్ చేయాలని తెలిపారు. డ్రగ్ పార్శిళ్ల పేరుతో మోసాలు ఎక్కువగా దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న కాల్ సెంటర్ల నుంచి జరుగుతున్నాయని అన్నారు.
Read also: Vivek Venkatswamy: తెలంగాణ ఏర్పాటుతో కేవలం ఆ కుటుంబం మాత్రమే లాభ పడింది..!
టెలిగ్రామ్ ద్వారా భారతీయులను రిక్రూట్ చేసుకుని.. వారి సాయంతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని అన్నారు. తైవాన్, థాయిలాండ్, కంబోడియా దేశాల నుంచి డ్రగ్ పార్శిల్ ఫ్రాడ్స్ జరుగున్నాయన్నారు. డ్రగ్ పార్శిళ్ల పేరుతో ప్రపంచంలో జరుగుతున్న మొత్తం మోసాల్లో 90 శాతం భారతదేశంలోనే సంభవిస్తుండం గమనార్హం. ఈ మోసాలకు చెక్ పెట్టాలంటే స్వీయ అవగాహన కలిగిఉండటం ఒక్కటే మార్గం అన్నారు. అజ్ఞాత వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తే అసలే స్పందించవద్దు. పోలీసులమని అని చెప్పగానే భయపడి పోయి వారు చెప్పినట్లు చెయొద్దన్నారు. నగదును ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చెయొద్దని తెలిపారు. ఒకవేళ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సలహా ఇచ్చారు.
ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులకు అలెర్ట్!! డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసులు ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ICICI Bank, Yes Bank, RBL Bank, IndusInd Bank, RBL Bank, IDFC First Bank, AU Small Finance Bank తో పాటు Punjab National Bank… pic.twitter.com/w3MVFUsyXE
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 27, 2024
Aadujeevitham – The Goat Life Review: ది గోట్ లైఫ్- ఆడు జీవితం రివ్యూ
తాజావార్తలు
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?