Kishan Reddy Letter to KCR: పీఎం మిత్రలో చేరండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు… కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల వ్యవహారం నుంచి.. రాజకీయ విమర్శల వరకు ఈ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమన్న చందంగా ఉంది పరిస్థితి.. అయితే, ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పీఎం మిత్రలో చేరాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. దాని కోసం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.. వస్త్ర పరిశ్రమని ప్రోత్సహించడానికి ఈ పీఎం మిత్ర కార్యక్రమం ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్న ఆయన.. గత నెల 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జౌళి, వస్త్ర పరిశ్రమ శాఖ లేఖ రాసిందని.. తన లేఖలో గుర్తుచేశారు..
Read Also: Raja Singh on EC Notice: నేను తప్పు చెప్పలే.. ఈసీకి వివరణ ఇస్తా..
Also Read
ఇక, వచ్చే నెల 15వ తేదీ వరకు ప్రతిపాదనలు పంపించాలని కోరిన కిషన్‌రెడ్డి.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అసలే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పథకాలను తెలంగాణ సర్కార్ వ్యతిరేకిస్తూనే వస్తుంది.. అంతకంటే మిన్నగా.. తమ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయని చెబుతూ వస్తుంది.. ఈ తరుణంలో.. పీఎం మిత్రలో చేరుతుందా? లేదా?.. కిషన్ రెడ్డి లేఖపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!