హుజురాబాద్ లో టీఆర్ఎస్ దే నైతిక విజయం అని ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి నన్ను ఓడించాయన్నారు. ఓటమికి నేనే నైతిక బాధ్యత వహిస్తున్నానని ప్రకటించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ఈ ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ కు అభినందనలు తెలిపారు. ఇక, దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోరాడుతాయి… కానీ, హుజురాబాద్ మాత్రం కలసి పని చేస్తాయని…
హుజురాబాద్ లో బీజేపీ విజయం ప్రజల విజయం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు నీతికి, న్యాయానికి మద్దతుగా నిలిచారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ కి మద్దతు ఇచ్చిన హుజురాబాద్ ప్రజానీకానికి, నా తరపున కేంద్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు. ఖర్చుతో కూడుకున్న ఎన్నికల్లో పాలక పార్టీ మభ్యపెట్టినా, వాటిని లెక్క చేయకుండా ప్రజలు బీజేపీ కి ఓటు వేసి గెలిపించారు. హుజురాబాద్ ప్రజలు చరిత్ర తీరగరాశారు.…