UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
- 2027 యూపీ ఎన్నికల ముందు ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల రగడ
- కనీసం 150 సీట్లు కోరుతున్న కాంగ్రెస్
- కాంగ్రెస్ డిమాండ్‌పై ఐపీ సింగ్ ఘాటు వ్యాఖ్యలు
- 403 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్
- 5 తరాల వరకు గాంధీ కుటుంబం నుంచి ప్రధాని కాలేరని వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Election 2027: వచ్చే ఏడాది మొదల్లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతునున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు ప్రచార పర్వాన్ని ఇప్పుడే ప్రారంభించాయి. ఇదిలా ఉంటే, సీట్ల పంపకాల్లో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడింది. 150 పైగా సీట్లు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎస్పీ నేత ఐపీ సింగ్ తీవ్రంగా విమర్శించారు. ‘‘లూటియన్స్ కాంగ్రెస్ వాళ్లు యూపీలో మొత్తం 403 స్థానాల్లో పోటీ చేస్తారు. రాబోయే 5 తరాల వరకు ఏ గాంధీ అని పిలువబడే వ్యక్తి ప్రధానమంత్రి కాలేరు. 1989 నుంచి గాంధీ కుటుంబం ప్రధాని పదవిని చేపట్టలేదు. రాబోయే అనేక దశాబ్ధాల్లో కూడా ఇదే జరుగుతుంది’’ అని తీవ్ర స్థాయితో ఐపీ సింగ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కూర్చుని పగటి కలలు కంటున్నారని వెక్కిరించారు.
కాంగ్రెస్ వ్యూహాకర్తలను టార్గెట్ చేస్తూ… యూపీలో కాంగ్రెస్‌కు అంత బలం ఉంటే 403 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి తన బలాన్ని ఎందుకు పరీక్షించుకోకూడదు.? అని ప్రశ్నించారు. పొత్తులు, రాజకీ పరిణామాలనే ఊతకర్రలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఇంకెంత కాలం సాగుతాయి? రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించి రెండున్నర దశాబ్ధాలు గడిచాయని, తరాలు మారాయి, కానీ కాంగ్రెస్ ఇప్పటికీ అవే ప్రశ్నల్ని ఎదుర్కొంటోందని ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ సాధించింది ఏంటని ప్రశ్నించారు. కేవలం కెమెరాలు, వేదికలు, పెద్ద పెద్ద ప్రకటనలు మాత్రమే రాజకీయ పునాదిని నిర్మించలేదని హితవు చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల బలం, ఓటర్లతో నిరంతర సంబంధం రాజకీయ సంస్థకు అసలైన బలమని అన్నారు.
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 403 స్థానాల్లో 150 స్థానాలు మాకు దక్కాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. 100కు సీట్ల సంఖ్య తగ్గకూడదనే నిర్ణయంపై ఆ పార్టీ ఉంది. ఇక ఎస్పీ 80 సీట్లు ఇవ్వాలని భావిస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!