Atrocious: హబ్సిగూడలో దారుణం.. స్కూల్ బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious: స్కూల్ బస్సును నడిపే డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు కండీషన్ లేని బస్సులపైనా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బస్సు డ్రైవర్లపైనా, వారిని కిరాయికి తీసుకున్న స్కూల్ యాజమాన్యంపైనా చర్యలు తీసుకుంటున్న డ్రైవర్ల ధోరణి మాత్రం మారడం లేదు. డ్రైవర్ల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది ఘటన హబ్సిగూడ రవీంద్రనగర్ లో చోటుచేసుకుంది.
Also Read
ఇవాళ ఉదయం హబ్సిగూడ రవీంద్రనగర్‌లో తమ బాబుని జూన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా, పక్కనే అమ్మమ్మ చేతిలో ఉన్న రెండేళ్ల చిన్నారి కిందికి జారి తెలియకుండానే బస్ టైర్ కిందకి పడిపోయింది. అమ్మమ్మ చూసే లోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. బస్సు ఆపాలని పిలిచేలోపే చిన్నారిపై బస్సు టైరు వెల్లింది పాప టైరు కింద ఉండటంతో.. బస్ డ్రైవర్ గమనించలేదు, బస్‌ను ముందుకు తీయడంతో చిన్నారి టైర్ కింద పడి అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఓయూ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
స్కూల్ వద్దకి విద్యార్ధి సంఘాలు చేరుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్ట్ మార్టం తరువాత చిన్నారి మృతదేహాన్ని కేరళ తీసుకవెళ్తామని కుటుంబ సభ్యులు అంటున్నారు. తమ కళ్లముందు ఆడుకుంటున్న చిన్నారి కొద్ది సమయంలో తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బస్సు డ్రైవర్ పాపను గమనించి వుంటే తమ పాప బతికి ఉండేదని వాపోయారు. ఇది బస్సు డ్రైవర్ తప్పిదమే అని మండిపడుతున్నారు. అధికారులు డ్రైవర్ ను, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పాప కుటుంబ సభ్యులు.
Viral Video: జడ్జిపై దాడి చేసిన నిందితుడు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!