TS High Court: వనమా పై అనర్హత వేటు.. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jalagam Venkatarao: తెలంగాణ హైకోర్టు జోక్యంతో నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో అత్యంత సమీప అభ్యర్థి జలగం వెంకటరావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించి సంచలన తీర్పు ఇచ్చారు. వనమా విజయంపై జలగం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఆస్తులను సక్రమంగా ప్రకటించలేదన్న ఆరోపణలున్నాయి. ఇవి నిజమని గుర్తించిన కోర్టు అతడిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించారు. జలగం వెంకట్రావును 2018 డిసెంబర్ 12 నుంచి ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది.
Read also: IIIT Student: ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు.. ఏడాది వ్యవధిలో ముగ్గురు..!
Also Read
వనమా వెంకటేశ్వరరావు 1989లో తొలిసారి కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4,120 ఓట్ల తేడాతో గెలుపొందారు. జలగం వెంకటరావు ఆంధ్ర ప్రదేశ్ ఐదవ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు. ఆయన సోదరుడు జలగం ప్రసాదరావు కూడా మాజీ మంత్రి. వెంకటరావు 2004లో తొలిసారిగా ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీ(బీఆర్)ఆర్‌ఎస్ తరపున పోటీ చేసి కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) తరఫున ఖమ్మం (ఉమ్మడి) నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే.
IIIT Student: ఐఐటీ విద్యార్థి కార్తీక్ కథ విషాదాంతం.. విశాఖ ఆర్కే బీచ్ లో శవంగా తేలాడు..!
తాజావార్తలు
-
Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..