Shadnagar Crime: నందిగామలో సంచలనం సృష్టించిన జంట హత్యలు.. హత మార్చింది బీహారీ జంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shadnagar Crime: అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలిక, 60 ఏళ్ల వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామలో శుక్రవారం రాత్రి జరిగింది. అయితే, వీరిని ఎవరు, ఎందుకు హత్య చేశారనే కోణంలో స్ధానిక సీఐ రామయ్య నేతృత్వంలో పోలీసులు క్లూస్ టీంతో సహా దర్యాప్తు చేశారు. కేవలం హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు చాకచక్యంగా వలపన్ని హంతకులను అరెస్టు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం చిన్నారిని, వృద్ధురాలిని హత్య చేసిన హంతకులు పోలీసుల అదుపులో ఉన్నారు. నందిగామ సిఐ రామయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డికి సమాచారం అందించగా వారు రంగంలోకి దిగారు. రాత్రికి రాత్రి నాలుగు పోలీసు బృందాలు హంతకుల కోసం జల్లెడ పట్టాయి. ఈ నేపథ్యంలో హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే బీహార్ కు చెందిన ఇద్దరు భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం వారిని పోలీసు కస్టడీలో ఉంచినట్టు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రానికి చెందిన కృష్ణ, శశికళ దంపతులు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి ఇంటి పక్కనే వారి బంధువు పార్వతమ్మ అంగన్‌వాడీ ఆయాగా పనిచేసేకుంటూ ఒంటరిగా ఉంటోంది. దీంతో కృష్ణ, శశికళల కూతురు భానుప్రియ నాలుగేళ్లుగా పార్వతమ్మకు తోడుగా ఆమె వద్దే ఉంటోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా భానుప్రియ కనిపించడం లేదని ఆ చిన్నారి తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి పార్వతమ్మ ఇంటికి వెళ్లి చూశారు. అప్పటికే భానుప్రియ రక్తపు మడుగులో పడి ఉంది. ఆ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు మెడను కోసి హత్య చేసినట్టు గుర్తించారు. అంతేకాకుండా పార్వతమ్మపై కూడా దాడి చేసినట్లు గుర్తించారు. దీంతో భయాందోళన చెందిన వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. కొన ఊపిరితో ఉన్న పార్వతమ్మను షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. రెండు రోజుల క్రితం బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి పార్వతమ్మ ఇంట్లో అద్దెకు దిగాడు. ఈ హత్య తర్వాత అతను కనిపించడం లేదని స్థానికులు తెలిపారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
జంట హత్యలపై నందిగామ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు. ఇంట్లో అద్దెకు దిగిన బిహారీలు ఆలుమగల జంట ఇంత ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పార్వతమ్మ, చిన్నారి భానుప్రియలను హతమార్చి ఆమె వద్ద ఉన్న బంగారం నగదు దోచుకెళ్లడానికి మర్డర్ ప్లాన్ చేశారని వెల్లడించారు. ఇంట్లో వారిని లక్ష్యంగా చేసుకొని దారుణాతి దారుణంగా హింసించి చంపారని తెలిపారు. అయితే కొన ఊపిరితో ఉన్న పార్వతమ్మ మార్గమధ్యలో మరణించిందని అన్నారు. స్థానికులు నందిగామ సిఐ రామయ్యకు ఈ విషయం చెప్పగా రంగంలోకి దిగిన రామయ్య తదితర పోలీసు బృందాలు హంతకులను వెంటాడి వేటాడి పట్టుకున్నారని వివరించారు. పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకోవడంతో వారు దొరికారని, లేకపోతే వారు వారి బీహార్ రాష్ట్రానికి గుట్టుగా వెళ్లిపోయేవారని తెలిపారు. కేవలం గంటల వ్యవధిలోనే మర్డర్ కేసు చేదించిన నందిగామ సిఐ రామయ్య తదితర పోలీసు బృందంపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
Aliabhat : కిల్లింగ్ పోజులతో రెచ్చగొడుతున్న అలియాభట్..!!
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..