Tummala Nageswara Rao : మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జైత్రయాత్రే..
- ప్రతిపక్షాలపై తుమ్మల ఘాటు విమర్శలు
- బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ఫోకస్
- పేదలకు సన్నబియ్యం, సంక్షేమ పథకాలతో ప్రజాదరణ
- మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘన విజయం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్న ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండు సంవత్సరాలుగా అసాధ్యమని భావించిన ఎన్నో సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని స్పష్టం చేశారు. కేవలం అసూయతోనే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, ప్రజలు వారిని ఎప్పుడో తిరస్కరించారని ఆయన ఎద్దేవా చేశారు.
Nuclear Deal: అణు యుద్ధం వస్తుంది..!? అగ్రదేశాల డీల్ ముగియడంతో భయం గుప్పిట్లో ప్రపంచం!
Also Read
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక నిర్ణయాలను మంత్రి తుమ్మల ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులగణన చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన గర్వంగా ప్రకటించారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకునే నేడు కేంద్ర ప్రభుత్వం కూడా తలవంచి కులగణన చేపట్టబోతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ (A, B, C, D) విషయంలో దశాబ్దాల నాటి కల సాకారం చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 13,000 కోట్లు వెచ్చించి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన వెల్లడించారు.
గత పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వారే నేడు నీతులు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. “రైతాంగం, పేదలు, నిరుద్యోగులు సంతోషంగా ఉంటే ఓర్వలేక ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నాయి. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ , పంచాయతీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పని అయిపోయిందని ప్రచారం చేశారు, కానీ ప్రజలు తమ ఓటుతో మమ్మల్ని ఆశీర్వదించి వారికి బుద్ధి చెప్పారు” అని తుమ్మల గుర్తు చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రజలు సమాధానం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సహకరించకపోయినప్పటికీ, అవసరమైతే తల తాకట్టు పెట్టయినా సరే అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల తేల్చి చెప్పారు. తాము చేసే పనులే తమకు రక్షణ అని, కాంగ్రెస్ పార్టీ ఎవరి విమర్శలకూ బెదరదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 100 శాతం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని ఆయన జోస్యం చెప్పారు.
Blood Fall: మంచు కొండల నుంచి కారుతున్న రక్తం.. ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రకృతి రహస్యం!
తాజావార్తలు
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Ashok Gehlot: కాంగ్రెస్‌లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి